పది పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2020-05-30T11:02:27+05:30 IST

జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలు పునఃప్రారంభం కానున్నాయని, వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు

పది పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

జిల్లా వ్యాప్తంగా 102 పరీక్ష కేంద్రాల ఏర్పాటు   

హాజరుకానున్న 12,751 మంది విద్యార్థులు   

థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి కేంద్రాల్లోకి అనుమతించాలి : కలెక్టర్‌ శరత్‌


కామారెడ్డిటౌన్‌, మే 29: జూన్‌ 8 నుంచి పదో తరగతి పరీక్షలు పునఃప్రారంభం కానున్నాయని, వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా, కరోనా వైరస్‌ భారిన పడకుండా పరీక్ష కేంద్రాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ అధికా రులను ఆదేశించారు. పదోతరగతి పరీక్షలపై అధికా రులతో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించా రు. జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు పదోతరగతి ప రీక్షలు జరుగుతాయని, గతంలో 60 పరీక్ష కేంద్రాలు ఉండగా.. అదనంగా 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 12751 మంది విద్యార్థులు పరీక్షలు  రాస్తున్నారన్నారు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, కేంద్రాల్లో శానిటైజర్‌ తప్పనిసరిగా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని,  జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. ఎస్‌సీ, ఎస్‌ టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టల్‌లను శానిటైజే షన్‌ చేయాలన్నారు. 


2న స్పీకర్‌చే జాతీయ పతాకావిష్కరణ

జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలె క్టర్‌ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తా రని కలెక్టర్‌ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్స వం సందర్భంగా  నిర్వహించే కార్యక్రమాలపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 8.30 గంట లకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దని వాళ్లు అర్పిస్తారని, ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ కా ర్యాల యంలో జాతీయపతాకావిష్కరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు భౌతిక దూరం, మాస్క్‌లు ధరించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోత్రే, ఆర్‌డీవో రాజేంద్రకుమార్‌, డీఈవో రాజు, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


రక్తదానం మరొకరికి ప్రాణదానం

రక్తదానం మరొకరికి ప్రాణదానమని, యువత రక్తదానం చేయడానికి యువత ఉత్సాహం గా ముందుకు రావాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శు క్రవారం రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాన్సువాడ అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాని కి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి అట వీశాఖను అభినందించారు. ప్రమాదంలో గాయపడి న క్షతగాత్రులకు, గర్భిణులకు రక్తం చాలా అవసర మని, సమాజహిత కార్యక్రమాల్లో అందరూ పాల్గొ నాలని కలెక్టర్‌ సూచించారు.


డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేయాలి

వ్యవసాయాన్ని లాభసాటి చేసి, రైతులను బలో పేతం చేయడం కోసమే ప్రభుత్వం నియంత్రిత వ్య వసాయ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ అన్నా రు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో నియంత్రిత సాగుపై రైతులకు అవగా హన సదస్సును నిర్వహించారు. ధర లేని పంటల ను వేయకుండా మార్కెట్‌లో డిమాండ్‌, ధర ఉన్న పంటలను వేయాలన్నారు. మొక్కజొన్న పంటలకు బదులుగా.. పత్తి పంట వేయాలని, నిరంతర మద్ధ తు ధర వస్తుందన్నారు.


సోయాబీన్‌కు డిమాండ్‌ ఉందని తెలిపారు. రైతు సమన్వయ సమితి కో-ఆర్డి నేటర్లు, ఏఈవోలు సలహాలు అందజేస్తారని, వరి, పత్తి, కంది, సోయాబీన్‌ తదితర పంటల విత్తనాలు సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐదువేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా చేసి ఓ ఏఈవోను నియమించామన్నారు. పిచికారి మందులను ఇష్టం వచ్చినట్లు వినియోగించొద్దని, ప్రతీ క్లస్టర్‌లో రూ.20 లక్షలతో రైతు వేదికలను నిర్మించాలన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పి.సాగర్‌, గంగాధర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జి ల్లా వైస్‌ చైర్మన్‌ సంజీవ్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, జేడీఏ నాగేంద్ర య్య, ఎంపీపీ నీరజ, జడ్పీటీసీ పద్మ, సర్పంచ్‌ రాజ మణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-05-30T11:02:27+05:30 IST