వైవీయూలో ఆర్మీ ఏజ్‌ విభాగాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-06-19T05:05:24+05:30 IST

వైవీయూనివర్శిటీలో ఆర్మీ ఏజ్‌ విభాగాల ఏర్పాటుకు సంఘం కర్నల్‌ దినే్‌షకుమార్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి తెలిపారు.

వైవీయూలో ఆర్మీ ఏజ్‌ విభాగాల ఏర్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న వైవీయూనివర్శిటీ వీసీ సూర్యకళావతి

కడప(వైవీయూ), జూన్‌ 18: వైవీయూనివర్శిటీలో ఆర్మీ ఏజ్‌ విభాగాల ఏర్పాటుకు సంఘం కర్నల్‌ దినే్‌షకుమార్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి తెలిపారు. నూతన విద్యావిధానం అనుసరించి వైవీయూలో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల విద్యార్థులు ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎన్‌సీసీ చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్‌సీసీ యూనిట్‌ను వైవీయూలో ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీసీ 30 ఆంధ్రా బెటాలియన్‌ క్యాంప్‌ కమాండెంట్‌ కర్నల్‌ దినే్‌షకుమార్‌ వైవీయూకు శుక్రవారం వచ్చి  వీసీ, అధికారులతో సమావేశం నిర్వహించి వైవీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆర్మీ వింగ్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ ఆంధ్రా బెటాలియన్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌, అధ్యాపకులు రాంప్రసాద్‌రెడ్డి, చంద్రమతి శంకర్‌, పీఆర్‌వో సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:05:24+05:30 IST