హౌసింగ్‌ సమస్యలపై కంట్రోల్‌ రూం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-06-20T04:51:08+05:30 IST

హౌసింగ్‌ సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యాన్‌చంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హౌసింగ్‌ సమస్యలపై కంట్రోల్‌ రూం ఏర్పాటు

కడప(కలెక్టరేట్‌) జూన్‌ 19 : హౌసింగ్‌ సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యాన్‌చంద్ర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్‌ రూంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్స్‌, యామినిటీ సెక్రటరీలు, అసిస్టెంట్‌ ఇంజనీరు, డిప్యూటీ ఇంజనీరులను ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్‌ రూం ద్వారా జిల్లాలోని మండల స్థాయి అధికారులతో, లబ్ధిదారులతో వివరాలు సేకరించామన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షిస్తామన్నారు. మండల స్థాయి అధికారులు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అన్ని శాఖల వారు కంట్రోల్‌ రూంకు సహకరించి సమాచారంఅందజేయాలని కోరారు. 

Updated Date - 2021-06-20T04:51:08+05:30 IST