10న కార్యాలయాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-08T04:44:38+05:30 IST

నూతనం గా ఏర్పాటైన మహ్మదాబాద్‌ మండల కేంద్రంలో ఈ నెల 10న ప్రభుత్వ కార్యాలయాలను ప్రారం భించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖ అధికా రులను ఆదేశించారు.

10న కార్యాలయాల ఏర్పాటు
వీడియోకాన్ఫరెన్సు ద్వారా ఆదేశాలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

- వీడియో కాన్ఫరెన్స్‌లో పురమాయించిన కలెక్టర్‌ వెంకట్రావు

- మహమ్మదాబాద్‌లో తొలుత కొన్ని ఆఫీసుల ఏర్పాటుకు ఆదేశం


మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మే 7 : నూతనం గా ఏర్పాటైన మహ్మదాబాద్‌ మండల కేంద్రంలో ఈ నెల 10న ప్రభుత్వ కార్యాలయాలను ప్రారం భించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు సంబంధిత శాఖ అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాల యం నుంచి ఆయన మహమ్మదాబాద్‌లో కార్యాల యాల ప్రారంభోత్సవంపై సంబంధిత జిల్లా, మం డల అధికారులను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పురమాయించారు. నిర్వహించారు. రాష్ట్ర ప్రభు త్వం మహమ్మదాబాద్‌ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, గెజిట్‌ను  జారీ చేసి న విషయం తెలిసిందే. దీని ఆధారంగా ముఖ్య మైన కార్యాలయాలను మండల కేంద్రంలో ప్రాంభించేందుకు చర్యలు తీసుకుంటున్నటు తెలి పారు. మందుగా ముఖ్యమైన కార్యాలయాలను, దశలవారీగా అన్ని మండల కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. త హసీల్దార్‌ కార్యాలయం, మండల విద్యాశాఖ అధి కారి కార్యాలయం, మండల వ్యవసాయ శాఖాధి కారి కార్యాలయా లను ఈ నెల 10న ప్రారంభిం చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనం తరం పోలీసు కార్యాలయాలన్ని కూడా ప్రాంభిం చాలని ఆదేశించారు.  సోమవారం మండలంలో నూతన కార్యాలయాలను ప్రారంభిస్తున్న నేపథ్యం లో తహసీల్దార్‌కు అవసరమైన లాగిన్‌, పాస్‌వర్డ్‌ కేటాయింపు, ఏఏ శాఖలో ఎన్ని పోస్టులు అవసర మో మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపాలని ఆదేశించారు. ముందుగా తాత్కాలికంగా జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తహ సీల్దార్‌, ఎంఈవో, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా ప్రాంభిం చాలని, అనంతరం స్థలాన్ని గుర్తించి పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. తహసీల్దారుతో పాటు, మండల విద్యాశాఖ అధికారి, మండల వ్యవసాయ అధికా రులు తక్షణమే మహ్మదాబాద్‌ వెళ్లి నూతన కార్యాలయాల ప్రారంభానికి అవసరమైన ఏర్పా ట్లు చేయాలని ఆదేశించారు. కార్యాలయాల ప్రా రంభోత్సవంలో అధికారులతో పాటు సిబ్బంది కూడా ఉండాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఆర్డీవో పద్యశ్రీ, ఇన్‌చార్జి డీఈవో అనసూయ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T04:44:38+05:30 IST