వైవీయూలో వేమనపీఠం ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-20T05:19:20+05:30 IST

వైవీయూనివర్శిటీలో వేమన పీఠం ఏర్పాటుతో పాటు ప్రతియేటా వేమన సత్కారాలను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వీసీ సూర్యకళావతి తెలిపారు. బుధవారం వైవీయూలో ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

వైవీయూలో వేమనపీఠం ఏర్పాటు
వేమన విగ్రహానికి పూలమాల వేస్తున్న వీసీ సూర్యకళావతి

వేమన జయంతి ఉత్సవాల్లో వీసీ సూర్యకళావతి

కడప(వైవీయూ), జనవరి 19: వైవీయూనివర్శిటీలో వేమన పీఠం ఏర్పాటుతో పాటు ప్రతియేటా వేమన సత్కారాలను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వీసీ సూర్యకళావతి తెలిపారు. బుధవారం వైవీయూలో ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వీసీ సూర్యకళావతి, రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ చంద్రమతి శంకర్‌లు యూనివర్శిటీలోని యోగివేమన, అంబేడ్కర్‌, వైఎ్‌సఆర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వేమన తాత్విక చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర పరిపాలన భవనం మీదుగా ఆర్ట్స్‌ భవనం వరకు కొనసాగింది. అనంతరం సమావేశ మందిరంలో వేమన జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ దాతల సహకారంతో వేమన ట్రస్టును ఏర్పాటు చేశామని, యూనివర్శిటీ గ్రాంట్‌ కమీషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వేమన పీఠం ఏర్పాటుకు సంబంధించి నివేదికను అందజేశామన్నారు. వేమన సాహిత్యంపై పరిశోధనకు నిధులను కోరుతున్నామని, వేమన సాహిత్యాన్ని జనం మధ్యలోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా వేమన పీఠం పనిచేస్తుందన్నారు. రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌ మాట్లాడుతూ వేమన తెలుగువాడైనందుకు మనమంతా గర్వించాలన్నారు. ప్రిన్సిపల్‌ చంద్రమతి శంకర్‌ మాట్లాడుతూ మంచి సమాజం కోసం వేమన కృషి చేశారని కొనియాడారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్‌ వెంకటేశ్వర్లు ప్రధాన ఉపన్యాసకుడిగా హాజరై మాట్లాడారు. సభాసయన్వయకర్త డాక్టర్‌ ఎన్‌.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ వేమన చెప్పిన నీతిని స్వీకరిస్తే సమాజం బాగుపడుతుందన్నారు. ఎన్‌ఎ్‌సఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమం అర్థవంతంగా సాగిందని, వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్‌ పద్మ, డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు, వాసంతి, కృష్ణారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌, రంగయ్య, శంకర్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ పీవోలు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:19:20+05:30 IST