Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్‌ఎస్‌ వ్యవహరించింది: ఈటల

జగిత్యాల: హుజురాబాద్ ఉపఎన్నికలో తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అందరూ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని విమర్శించారు. సీపీ, కలెక్టర్‌కు చాలా సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని, బస్లలో ఈవీఎం కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. పోలింగ్ సిబ్బందికి కూడా దావత్, డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. కలెక్టర్ పొరపాటు జరిగిందని చెప్తున్నారని, ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా? అంటూ ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement