Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ వేయించుకోవాలి

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జైనూరు, డిసెంబరు 7: మండలవాసులు ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మండల కేంద్రంలోని విహికర్‌ సెక్షన్‌కాలనీ, మోమిన్‌పూర్‌, తదితర కాల నీల్లో మంగళవారం రాత్రి ఆయన ప్రజలతో మాట్లా డారు. కరోనా వాక్సిన్‌ వేయించుకోవడంపై కొంత మంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. మండల అధికారులు అన్ని గ్రామాల ప్రజలకు వాక్సిన్‌పై పూర్తి ఆవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌, తహ సీల్దార్‌ సాయన్న, ఎంపీడీవో ప్రభుదయ, ఆర్‌ఐ లీల బాయి, సర్పంచ్‌ మేస్రం పార్వతీబాయి, కోఆప్షన్‌ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్‌, హజ్‌కమిటీ సభ్యుడు ఇంతీ యాజ్‌లాల తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement