ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-04T05:37:37+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు కోరారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
చిల్పకుంట్ల ఐకేపీ కేంద్రంలో రైతులకు వ్యాక్సిన్‌ వేయిస్తున్న అదనపు కలెక్టర్‌

నూతనకల్‌, డిసెంబరు 3: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు కోరారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను రెవెన్యూ, వైద్య సిబ్బందిని శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. చిల్పకుంట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వ్యాక్సిన్‌ వేసుకొని రైతులు, హమాలీలకు వ్యాక్సిన్‌ వేయించారు. ఆయన వెంట తహసీల్దార్‌ జమీరోద్దీన్‌, ఏఈవో మురళీబాబు, ఏపీఎం కర్ణాకర్‌, ఏఈవో జానయ్య, ఆర్‌ఐలు షరీఫ్‌, సుజిత్‌ ఉన్నారు. 

మాస్కులు ధరించి మార్కెట్లోకి రావాలి

సూర్యాపేట సిటీ: మార్కెట్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి రావాలని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవి అన్నారు. శుక్రవారం మార్కెట్‌కు గేట్‌కు మాస్క్‌లు ధరించి రావాలని పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కార్యదర్శి ఎండీ ఫసీయొద్దీన్‌, గ్రేడ్‌ టూ కార్యదర్శి షంషీర్‌, అసిస్టెంటు కార్యదర్శి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా

నేరేడుచర్ల: ఒమైక్రాన్‌ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని మునిసిపల్‌ మేనేజర్‌ అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని దుకాణ యజమానులకు మాస్క్‌లు పెట్టుకోవాలని సూచించారు. మాస్క్‌లు లేకుండా కనిపిస్తే రూ.వెయ్యి జరిమానా తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది తదితరులున్నారు. 

ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలి

మద్దిరాల /   మఠంపల్లి : ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని తహసీల్దార్‌ మన్నన్‌ అన్నారు. మండల కేంద్రంలో ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, అంగన్‌వాడీ టీచర్‌ రమాదేవి, వైద్య సిబ్బంది ఉన్నారు. అపోహలను విడి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోనేలా ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించాలని మఠంపల్లి జడ్పీటీసీ బానోతుజగన్‌నాయక్‌ అన్నారు. భీల్యానాయక్‌తండా, సోమ్లాతండా, నిమ్మతండాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఉపసర్పంచ్‌ బాధ, బాలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

అనంతగిరి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించాలని బీజేపీ మండల నాయకులు వంగవీటి శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  



Updated Date - 2021-12-04T05:37:37+05:30 IST