కూతురు ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-23T02:29:35+05:30 IST

అనుమానం పెనుభూతమై.. చివరకు ఎంత దారుణాలకైనా తెగబడేలా చేస్తుంది. తమ అనుమానం నిజం కాదనే విషయాన్ని తెలుసుకున్న కొందరు దంపతులు.. మళ్లీ యథావిధిగా సంతోషంగా జీవిస్తుంటారు. అయితే...

కూతురు ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

అనుమానం పెనుభూతమై.. చివరకు ఎంత దారుణాలకైనా తెగబడేలా చేస్తుంది. తమ అనుమానం నిజం కాదనే విషయాన్ని తెలుసుకున్న కొందరు దంపతులు.. మళ్లీ యథావిధిగా సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ఇంకొందరు భర్తలు భార్యలపై, మరికొందరు భార్యలు భర్తలపై అనుమానం పెంచుకుని రోజూ గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో హత్యలు, ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. బీహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కూతురి ఎదుటే తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ రాష్ట్రం భాగల్‌పూర్‌ జిల్లా ఇషాక్‌చక్ పరిధి  నీలకంత్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపక్‌, నందనీ కుమారి దంపతులు.. తమ ఏడేళ్ల కుమార్తెతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. మొదట్లో భార్యను బాగా చూసుకున్న భర్త.. రాను రాను ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. వేరే వారితో అక్రమ సంబంధం అంటగడుతూ నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో తరచూ మందు తాగి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇటీవల ఓ రోజు కుమార్తె ఎదుట దంపతుల మధ్య ఇదే విషయమై మళ్లీ గొడవ జరిగింది.

ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..


ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త.. కుమార్తె ఎదుటే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో చంపేశానని తెలిపాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలి కుమార్తెను విచారించారు. రోజూ తన తల్లిని వివిధ కారణాలు చూపిస్తూ వేధిస్తుంటాడని, ఓ రోజు తనను కూడా చంపేయాలని చూశాడని బాలిక తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందనీ కుమారి హత్యతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

కవలలు కావడంతో భర్తను గుర్తుపట్టలేకపోయిన భార్య.. దీన్నే అవకాశంగా తీసుకున్న అన్న.. తమ్ముడు లేని సమయంలో..

Updated Date - 2022-05-23T02:29:35+05:30 IST