woman Missing: చెరువు ఒడ్డున చెప్పులు ఉండడంతో.. మహిళ కోసం రాత్రంతా వెతికిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు.. రెండు రోజుల తర్వాత జరిగిన ఘటనతో..

ABN , First Publish Date - 2022-08-28T01:54:33+05:30 IST

భర్తతో పాటూ బీచ్‌కి వెళ్లి సడన్‌గా అదృశ్యమైన వైజాగ్ సాయిప్రియ (Vizag Saipriya) కోసం పోలీసులు, నేవీ, కోస్టుగార్డు సిబ్బంది రెండు రోజుల పాటు గాలించారు. ఈ క్రమంలో ప్రియుడిని..

woman Missing: చెరువు ఒడ్డున చెప్పులు ఉండడంతో.. మహిళ కోసం రాత్రంతా వెతికిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు.. రెండు రోజుల తర్వాత జరిగిన ఘటనతో..

భర్తతో పాటూ బీచ్‌కి వెళ్లి సడన్‌గా అదృశ్యమైన వైజాగ్ సాయిప్రియ (Vizag Saipriya) కోసం పోలీసులు, నేవీ, కోస్టుగార్డు సిబ్బంది రెండు రోజుల పాటు గాలించారు. ఈ క్రమంలో ప్రియుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నానంటూ యువతి సడన్ షాక్ ఇచ్చిన ఘటన అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఇద్దరు పిల్లల తల్లి కూడా దాదాపు ఇలాంటి పనే చేసింది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం కాస్త మార్చింది. చెరువు ఒడ్డున చెప్పులు ఉండడంతో నదిలో మునిగి ఉంటుందని భావించారు. ఆమె ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రాత్రంతా గాలించాయి. అయితే రెండు రోజుల తర్వాత జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాం జిల్లాలోని అలోట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖజురి దేవరా గ్రామానికి చెందిన విష్ణుబాయి ప్రజాపత్‌కు నారాయణి గ్రామానికి చెందిన బబ్లూ ప్రజాపత్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలావుండగా, రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రం ధబ్లా గ్రామానికి చెందిన ఘనశ్యామ్ రాథోడ్ అనే యువకుడు.. ఖజురి దేవరా ప్రాంతంలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇటీవల విష్ణుబాయికి, ఘనశ్యామ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. విష్ణుబాయి తన భర్తకు తెలీకుండా ప్రియుడితో కలుస్తూ ఉండేది.

కాళ్ల పారాణి ఆరకముందే.. ఆస్పత్రిలో చేరిన యువతి.. ఇంటి బయట నీళ్లు పడుతుండగా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..


అయితే జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. చివరకు పారిపోయి పెళ్లి చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారు. రెండు రోజుల క్రితం గ్రామానికి సమీపంలోని చెరువు వద్ద చెప్పులు వదిలి, అనంతరం ప్రియుడితో పాటూ పారిపోయింది. విష్ణుబాయి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు చెప్పులు కనిపించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందేమో అనుకుని అలోట్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. చివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పిలిపించారు.

ప్రేమికుడికి పెళ్లవడంతో అతడి సోదరుడిని ప్రేమించిన యువతి.. అతనూ ఊరు విడిచి వెళ్లడంతో.. మూడో వ్యక్తితో వివాహం.. చివరకు ఓ రోజు..


అంతా కలిసి రాత్రంతా ఆమె కోసం వెతికారు. ఈ క్రమంలో ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా.. రాజస్థాన్‌లో ఉన్నట్లు తేలింది. రెండు రోజుల అనంతరం శుక్రవారం ప్రియుడిని వివాహం చేసుకుని నేరుగా అలోట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనకు భర్తతో ఉండడం ఇష్టం లేదని తేల్చిచెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏంటీ! ఇలాంటి స్టేటస్‌లు పెడుతున్నావని ప్రశ్నించిన స్నేహితులు.. ఏం లేదంటూ దాటవేసిన యువతి.. పెళ్లయిన మూడు నెలలకే..



Updated Date - 2022-08-28T01:54:33+05:30 IST