ఈ ఫొటోలోని బాలికను చూశారా..? రెండు మూడేళ్ల వయసే ఉంటుందనుకుంటున్నారా..? అసలు నిజమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-21T18:17:53+05:30 IST

కొందరు వయసు ఎక్కువ ఉన్నా.. చూసేందుకు మాత్రం చిన్నపిల్లల్లా కనిపిస్తుంటారు. జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో పెరుదల మధ్యలోనే ఆగిపోతుంటుంది..

ఈ ఫొటోలోని బాలికను చూశారా..? రెండు మూడేళ్ల వయసే ఉంటుందనుకుంటున్నారా..? అసలు నిజమేంటో తెలిస్తే..

కొందరు వయసు ఎక్కువ ఉన్నా.. చూసేందుకు మాత్రం చిన్నపిల్లల్లా కనిపిస్తుంటారు. జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో పెరుదల మధ్యలోనే ఆగిపోతుంటుంది. ఇలాంటి వారికి సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయడం చూస్తుంటాం. ప్రస్తుతం మనం చూస్తున్న బాలిక కూడా చూసేందుకు రెండు, మూడేళ్లు ఉన్నట్లుగా ఉంది.. కానీ అసలు విషయం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వాని జిల్లా దవాఖానలో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పన్సెమాన్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన కమార్తె సోనాలి కాంతిలాల్‌ను తీసుకుని అంగవైకల్య ధ్రువీకరణ పత్రం పొందేందుకు వచ్చింది. బాలికను చూసిన అధికారులు, స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 17ఏళ్ల వయసు ఉన్న ఆమె.. ఒకటిన్నర అడుగులు మాత్రమే ఎత్తు ఉంది. సోనాలికి ప్రస్తుతం నెలకు రూ.1000ల పింఛన్ వస్తోంది.

ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..


బాలికకు సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ అధికారులకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించగా.. బాలిక కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో బాలిక వివరాలను గిన్నిస్ బుక్ అధికారులకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా గతంలో నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతి అమ్గే.. రెండు అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత చిన్న అమ్మాయిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైందని తెలిపారు.

ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో ఊహించగలరా..? అసలు నిజం తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!

Updated Date - 2022-05-21T18:17:53+05:30 IST