Abn logo
Oct 23 2021 @ 23:16PM

జనాల ఆగ్రహం జగనకు తెలిసొచ్చింది..

జీవీ ఆంజనేయులు

జీవీ ఆంజనేయులు

గుంటూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): సీఎం పిలుపుతో వైసీపీ నేతలు నిర్వహించిన జనాగ్రహదీక్షల్లో జగనపై ఉన్న జనాగ్రహం బట్టబయలైందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పట్టుమని 20 నియోజకవర్గాలో కూడా వైసీపీ జనాగ్రహ దీక్షలు జరగలేదని తెలిపారు. చంద్రబాబు దీక్షను తప్పుపడుతున్న తాడేపల్లి పాలేరు సజ్జల సీఎం పదవి కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నాని ఆరోపించారు. సీఎం డ్రగ్స్‌లో మునిగితేలుతూ, పబ్జీలు ఆడుకుంటుంటే సజ్జల షాడో సీఎంలా పెత్తనం చలాయిస్తున్నారన్నారు.   అలానే వల్లభనేని వంశీ భాషను ఆయన తల్లి, కట్టుకున్న భార్యే ఆసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు చెప్పుదెబ్బల సత్కారం చేద్దామా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల చలామణీపై, పొరుగు రాషా్ట్రల పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. తాను మత్తులో జోగుతూ, యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న సీఎం, రాషా్ట్రన్ని డ్రగ్గాంధ్రప్రదేశగా మార్చారన్నారు.