Abn logo
Oct 24 2021 @ 12:50PM

పెళ్లికి హాజరవ్వాలంటే sp పర్మిషన్ తీసుకోవాలంట..: సుగుణమ్మ

తిరుపతి: పెళ్లికి హాజరవ్వాలంటే ఎస్పీ పర్మిషన్ తీసుకుని వెళ్లాలని పోలీసులు అంటున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న తన పుట్టినరోజని, అలిపిరి పాదాల మండపం దేవుడి దర్శనానికి వెళ్లడానికి అనుమతివ్వలేదని మండిపడ్డారు. మనవళ్లు, మనవరాళ్లతో హోటల్‌కు పోవటానికి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నామా? ఇంట్లో ఉన్నామా? అర్థం కావడం లేదన్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా పోలీసులు ప్రవేసిస్తున్నారని, ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.