ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

ABN , First Publish Date - 2022-01-24T05:59:40+05:30 IST

చారిత్రక భువనగిరి ఖిల్లాపై ఆదివారం పర్వతారోహణ శిక్షణ కొనసాగింది. భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో కొనసాగిన రాక్‌ క్లైంబింగ్‌, రాప్లింగ్‌ శిక్షణలో పలువురు పర్వతారోహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌

భువనగిరి టౌన్‌, జనవరి 23: చారిత్రక భువనగిరి ఖిల్లాపై ఆదివారం పర్వతారోహణ శిక్షణ కొనసాగింది. భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో కొనసాగిన రాక్‌ క్లైంబింగ్‌, రాప్లింగ్‌ శిక్షణలో పలువురు పర్వతారోహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలా గే జిప్‌లైన్‌ గేమ్‌ను కూడా ఆడారు. వారాంతపు సెలవుకావడంతో ఖిల్లాపై పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు రోజంతా ఖిల్లాను సందర్శించారు. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యాటకులందరూ మాస్కు లు, ధరించి భౌతిక దూరం పాటించాలని ఖిల్లా సిబ్బంది సూచించారు.

Updated Date - 2022-01-24T05:59:40+05:30 IST