ఉపపోరుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-02-12T05:35:03+05:30 IST

థర్డ్‌వేవ్‌ కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల కసరత్తు ముందుకు వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైనా కరోనా విజృంభణతో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొవిడ్‌ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్న దశలో జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల్లో జిల్లాలో ఉన్న ఖాళీల సంఖ్యను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఎన్నికల కమిషన్‌ నుంచి పంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి

ఉపపోరుకు కసరత్తు
గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

 - పంచాయతీల్లో ఖాళీ స్థానాల వివరాలు కోరిన ఎన్నికల కమిషన్‌

- నెలాఖరులో నోటిఫికేషన్‌కు అవకాశం

- 5 సర్పంచులు, 79 వార్డు స్థానాలు

- మళ్లీ ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ 


  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

థర్డ్‌వేవ్‌ కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో మళ్లీ గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల కసరత్తు ముందుకు వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైనా కరోనా విజృంభణతో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొవిడ్‌ నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్న దశలో జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల్లో జిల్లాలో ఉన్న ఖాళీల సంఖ్యను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఎన్నికల కమిషన్‌ నుంచి పంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికల సందడి మొదలు కానుంది. ఈ నెల చివరి వారంలోనే నోటిఫికేషన్‌ వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల్లో పదవులు దక్కించుకోవడానికి అశావహులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా ఎన్నికలు పూర్తవుతాయని భావిస్తూ   సన్నద్ధం అవుతున్నారు. 


జిల్లాలో ఖాళీలు ఇవే  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 35 గ్రామ పంచాయతీల పరిధిలో 5 గ్రామ సర్పంచులు, 79 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కొందరు జడ్పీటీసీలు, ఇతర పదవులకు ఎన్నికవడం, మరికొందరు మృతిచెందడం, ఇతర కారణాలతో రాజీనామాలు చేయడం వంటి పరిణామాలతో  ఖాళీలు ఏర్పడ్డాయి. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లిలో గత గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలను పూర్తిగా బహిష్కరించడంతో సర్పంచ్‌తోపాటు ఎనిమిది వార్డుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి పూర్తిగా ఎన్నికలు నిర్వహించనున్నారు. బోయినపల్లి మండలంలో దేశాయిపల్లిలో 7వ వార్డు, స్థబంపల్లి 5వ వార్డు, కొదురుపాక 4వ వార్డు, మల్కపూర్‌ 6వ వార్డు, రామన్నపేట 8వ వార్డు, చందుర్తి మండలం బండపల్లి 5వ వార్డు, జోగాపూర్‌ 5వ వార్డు, కట్టలింగంపేట 8వ వార్డు, మల్యాల 11వ వార్డు, ఇల్లంతకుంట మండలం గూడెపల్లి  1వ వార్డు, గంభీరావుపేట మండలం దేశాయిపేట 5వ వార్డు, కోనరావుపేట మండలం బావుసాయిపేట 4వ వార్డు, ధర్మారం 1వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, కనగర్తి 3వ వార్డు, 10వ వార్డు, మల్కపేట 8వ వార్డు, మంగళ్లపల్లె 1వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, మరిమడ్ల 2వ వార్డు, 5వ వార్డు, 7వ వార్డు, 9వ వార్డు, మర్తనపేట 5వ వార్డు, 4వ వార్డు, నిమ్మపల్లి 2వ వార్డు, నిజామాబాద్‌ 8వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డు, పల్లిమక్త 3వవార్డు, 7వ వార్డు, 8వ వార్డు, సుద్దాల 2వ వార్డు, ముస్తాబాద్‌ మండలం అవునూర్‌ 2వ వార్డు, గొపాల్‌పల్లి 5వ వార్డు, ముస్తాబాద్‌ 12వ వార్డు, తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ 9 వవార్డు, బద్దెనపల్లిలో సర్పంచ్‌తో పాటు మొత్తం 10 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. గండిలచ్చపేటలో 1వ వార్డు, జిల్లెల్ల 12వ వార్డు, లక్ష్మీపూర్‌లో 4వ వార్డు, మల్లాపూర్‌  1వ వార్డు, నేరేళ్ల 3వ వార్డు, 9వ వార్డు, రాళ్లపేట 8వ వార్డు, 4వ వార్డు, తంగళ్లపల్లి  9వ వార్డు, వేణుగోపాల్‌పూర్‌లో 4వ వార్డు, వీర్నపల్లి మండలం  గర్జనపల్లి 6వ వార్డు, శాంతినగర్‌ 1వ వార్డు, వేములవాడ మండలం అరెపల్లిలో 5వ వార్డు, వేములవాడ రూరల్‌ మండలం మల్లారంలో 2వ వార్డు, 6వ వార్డు, మర్రిపల్లి 8వ వార్డు, తుర్కాశినగర్‌ 4వ వార్డు, వట్టెంల 8వ వార్డు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణాపూర్‌లో 10వ వార్డులు ఖాళీగా ఉన్నాయి. 


5 గ్రామ సర్పంచుల స్థానాలకు ఎన్నికలు 

జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో గొల్లపల్లి, దాచారం, సోమారంపేట, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, వీర్నపల్లి మండలం బావుసింగ్‌నాయక్‌ తండా సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఉపసర్పంచ్‌ స్థానాలు కూడా ఖాళీ ఏర్పడ్డాయి. బోయినపల్లి మండలం దేశాయిపల్లి, ఇల్లంతకుంట మండలం గుండెపల్లి, గంభీరావుపేట మండలం దేశాయిపేట, కొత్తపల్లి, కోనరావుపేట మండలం కనగర్తి, మర్తనపేట, వేములవాడ మండలం అరెపల్లి ఉపసర్పంచుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

మళ్లీ కొత్త ఓటరు జాబితా  

గతంలో గ్రామ పంచాయతీ ఖాళీ స్థానాల వద్ద ఓటరు జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేసినా తాజాగా ఓటరు జాబితా సవరణ జరగడంతో మళ్లీ కొత్తగా రూపొందించనున్నారు. ఇందుకోసం ముందుగా ఓటరు జాబితాలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల కానుంది. జిల్లాలోని 35 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో వెల్లడించిన ఓటరు జాబితాల ప్రకారం దేశాయిపల్లిలో 86 మంది ఓటర్లు, మల్లాపూర్‌ 148, రామన్నపేట 91, స్థంబంపల్లి 120, బండపల్లి 140, మల్యాల 263, గొల్లపల్లి 409, దేశాయిపేట 61, ధర్మారం 582, కనగర్తి 164, మల్కపేట 161, మర్తనపేట 212, మరిమడ్ల 466, నాంపల్లి 229, నిజామాబాద్‌ 700, పల్లిమక్త 130 అంకుసాపూర్‌ 149, గండిలచ్చపేట 103, లక్ష్మీపూర్‌ 130, మల్లాపూర్‌ 35, నేరేళ్ల 259, రాళ్లపేట 212, తంగళ్లపల్లి 360, వేణుగోపాల్‌పూర్‌ 59, బద్దనపల్లి  1,154, గర్జనపల్లి 112, శాంతినగర్‌ 59, బావుసింగ్‌ నాయక్‌ తండా 492, అరెపలి 50, మల్లారం 151, తుర్కాశినగర్‌ 54, వట్టెంలలో 174 మందితో ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేయగా మళ్లీ మార్పులు జరగనున్నాయి. ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉండడంతో మరోసారి గ్రామ పంచాయతీల్లో ఉప సందడి నెలకొననుంది.


Updated Date - 2022-02-12T05:35:03+05:30 IST