Abn logo
Jun 14 2021 @ 01:06AM

నిత్య జీవితంలో వ్యాయామం తప్పనిసరి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌ 13 : నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి వ్యాయా మం తప్పనిసరి అని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రం లోని వివేకానంద మిని స్టేడియంలో ఆదివారం పట్టణ ప్రగతి నిధులు రూ. 12 లక్షలతో ఏర్పాటుచేయనున్న ఓపెన్‌ జిమ్‌ పనులకు బల్దియా చై ర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ భూమి పూ జ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అ భివృద్ధే ధ్యేయంగా వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మంచి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నా రు. అనంతరం పట్టణంలోని ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 4.20 లక్షల విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు చుక్క నవీన్‌, కూసరి అనీల్‌, పిట్ట ధర్మరాజు, ముస్కు నారాయణరెడ్డి, నాయకులు బ ద్దం జగన్‌మోహన్‌ రెడ్డి, మొగిలి, పవన్‌, డీఈ లచ్చిరెడ్డి ఉన్నారు.