POK లో జరిగిన ఎన్నికలు చట్టవిరుద్ధం : భారత విదేశాంగ శాఖ

ABN , First Publish Date - 2021-07-30T02:48:37+05:30 IST

పీఓకేలో జరిగిన ఎన్నికలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది.

POK  లో జరిగిన ఎన్నికలు చట్టవిరుద్ధం : భారత విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ : పీఓకేలో జరిగిన ఎన్నికలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అక్కడ జరిగిన ఎన్నికలన్నీ చట్టవిరుద్ధమేనని స్పష్టం చేసింది. ఆ ఎన్నికలను అక్కడి ప్రజలు పూర్తిగా తిరస్కరించారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రాంతాన్ని చట్ట విరుద్ధంగా ఆక్రమించామన్న విషయాన్ని దాచిపెట్టడానికే పాక్ ఇలాంటి ప్రయత్నాలకు ఒడిగడుతోందని విదేశాంగ శాఖ నిప్పులు చెరిగింది. పీఓకేలోని ప్రజలను పాక్ ఎలా చూస్తున్నారు, మానవ హక్కులను ఎలా ఉల్లంఘింస్తున్నారన్న విషయాలను ఈ ఎన్నికలు దాచిపెట్టలేవని ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట విరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలను పాక్ వెంటనే ఖాళీ చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. 


Updated Date - 2021-07-30T02:48:37+05:30 IST