స్కానింగ్‌ పేరిట దోపిడీ..

ABN , First Publish Date - 2020-09-20T07:29:21+05:30 IST

అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే చాలు కొం దరు ప్రైవేట్‌ వైద్యులు ఏ ఆపరేషన్‌ అయినా సరే సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ అంటూ కాసులు దండుకుంటున్నారు...

స్కానింగ్‌ పేరిట దోపిడీ..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరీక్షల పేరుతో వసూళ్లు

ఏ ఆపరేషన్‌ అయినా సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ తప్పనిసరి

రోగుల జేబులకు చిల్లులు

పట్టించుకోని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు


జగిత్యాల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ పేద ప్రజల రక్తం పిండేస్తోంది. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే చాలు కొం దరు ప్రైవేట్‌ వైద్యులు ఏ ఆపరేషన్‌ అయినా సరే సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ అంటూ కాసులు దండుకుంటున్నారు. గత్యంతరం లేక రోగులు అప్పు లు చేసి పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో కొద్ది మా సాలుగా ఈ వ్యవహారం సాగుతున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


పరీక్షల పేరిట డబ్బులు దండుకుంటున్న వైద్యులు

జిల్లాలో కొందరు ప్రైవేట్‌ వైద్యుల వ్యవహారం పేద ప్రజల పాలిట శాపంగా మారింది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ప్రైవేట్‌ వైద్యులు కరోనా బూచితో అనవసరమైన పరీక్షల పేరిట డబ్బు లు దండుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు 7 వేల మందికి పైగా కరోనా సోకగా, దాదాపు 60 మంది వరకు మరణించారు. దీంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఏ చిన్న జబ్బు వచ్చినా భయంతో వణికిపోతున్నారు. ఏ నొప్పి వచ్చినా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స అంటే చాలు ఇప్పుడు కరోనా పరీక్ష అంటూ భయపెడుతున్నారు. ఆపరేషన్‌ చేయాలంటే సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ చేయించుకోవాలని, ఆ తర్వాతే ఆపరేషన్‌ చేస్తామని అంటున్నారు. దీంతో కొందరు స్కానింగ్‌ సెంటర్ల య జమానులు ఇదే అదునుగా భావించి దర్జాగా వసూలు చేస్తున్నారు. ఫీ జుల నియంత్రణపై ఎవరూ పట్టించుకోకపోవడంతో అటు వైద్యులు, ఇటు స్కానింగ్‌ సెంటర్ల యజమానులు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాలు నొప్పి, చేతి నొప్పి అయినా మరే ఇతర శస్త్ర చికిత్స అయినా, డెలివరీ కోసం గర్భిణులకు కొందరు వైద్యులు సిటీ చెస్ట్‌ స్కా నింగ్‌ చేయించుకుంటే అందులో కొంత కమిషన్‌ను స్కానింగ్‌ సెంటర్‌ యజమానులు, వైద్యులు కూడా ముట్టచెబుతుంటారు. దీనికోసం ఇ ప్పుడు కొందరు వైద్యులు కరోనా వైరస్‌ సాకు చూపుతూ సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ తప్పనిసరి అంటున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే అందులోనే కరోనా వార్డు ఏర్పాటు చేయడంతో కొందరు రోగులు అటు వెళ్లేందుకు భయపడుతున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజ లు కూడా అప్పు చేసి మరీ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఆపరేషన్‌ చే యించుకుంటున్నారు. 


కొరవడిన పర్యవేక్షణ..

జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఆపరేషన్ల కో సం వెళ్తే ఫీజుల రూపంలో దోచుకుంటున్నారు. సిటీ స్కానింగ్‌ పేరిట వైద్యులు, స్కానింగ్‌ సెంటర్ల యాజమానులు రోగుల పాలిట శాపంగా మారారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రైవేట్‌ ఆ స్ప త్రులు, స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టి పేద ప్రజలు ఇబ్బందులు ప డకుండా చూడాల్సిన అవసరం ఉంది.


డెలివరీ కోసం వెల్లితే సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ చేయించుకోమన్నారు.

- మధుసూదన్‌, గాంధీనగర్‌, జగిత్యాల

ఇటీవల మా మరుదలను డెలివరీ కోసం ఓప్రైవేటు ఆసుపత్రికి తీ సుకవెళ్లాం. ఆరోగ్యం బాగానే ఉన్నా సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ రాశారు. ప్రై వేటు స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లాం. అక్కడ సిటీ చెస్ట్‌ స్కానింగ్‌ చేసి 15 నిమిషాల్లో ఏమిలేదు, కరోనా కూడా లేదని రూ. 3500 తీసుకుని రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్టు చూపెట్టిన తర్వాతే ప్రైవేటు ఆసుపత్రి వైధ్యులు డెలివరీ చేశారు.


రోగులను ఇబ్బంది పెడితే చర్యలు

- శ్రీధర్‌, జిల్లా వైధ్యాధికారి, జగిత్యాల

పరీక్షల పేరిట ప్రైవేటు వైధ్యులు రోగులను ఇబ్బందులు పెడితే చ ర్యలు తీసుకుంటాం. కరోనా వైరస్‌ ఇబ్బంది పెడుతున్న ఈ సమ యంలో ఇలా చేయడం సరికాదు. బాధితులు ఫిర్యాదు చేస్తే సదరు వైద్యులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-09-20T07:29:21+05:30 IST