హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలి: టీఎన్‌ఎస్‌ఎఫ్‌

ABN , First Publish Date - 2022-02-21T04:50:29+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఉప్పేరు సుభాన్‌ డిమాండ్‌ చేశారు.

హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలి: టీఎన్‌ఎస్‌ఎఫ్‌
హాస్టల్‌లో బియ్యాన్ని పరిశీలిస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 20 : జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఉప్పేరు సుభాన్‌ డిమాండ్‌ చేశారు.  యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు  సంక్షేమ వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుభాన్‌ మాట్లాడుతూ హాస్టళ్లల్లో పేరుకు సన్నబియ్యం వండి పెడుతున్నామని చెబుతున్నా అందులో 30శాతం నూకలు ఉండగా, బియ్యంలో పురుగులు పడినా పట్టించుకునేవారు లేరన్నారు. విద్యార్థులకు తగినన్ని గదులు, బాత్‌రూంలు లేవని, రెండేళ్లుగా కరోనా, లాక్‌డౌన్‌ పేరుతో సౌకర్యాల గురించి పట్టించుకోని పా లకులు ఇప్పటికైనా వాటిపై దృష్టిసారించాలన్నారు.  పెరిగిన ధరలకు అను గుణంగా మెస్‌  కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని, పెండింగ్‌లో ఉన్న చార్జీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  ఖాళీగా ఉన్న వార్డెన్‌లు, వాచ్‌మెన్‌లు, వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని, బాలికలకు  కేసీఆర్‌ కిట్లు సకాలంలో అందజేయాలని కోరారు.  కార్యక్రమంలో టీఎన్‌ఎప్‌ఎఫ్‌ సభ్యులు రాకేష్‌, తిరుమలేష్‌, రంగస్వామి, మహేష్‌, రాజశేఖర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-02-21T04:50:29+05:30 IST