చైనీయుల్ని కాపాడింది ఈ విధానమేనా?

ABN , First Publish Date - 2020-04-03T23:33:53+05:30 IST

ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ.. చైనా మాత్రం కొద్ది రోజుల్లోనే ఈ

చైనీయుల్ని కాపాడింది ఈ విధానమేనా?

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న వేళ.. చైనా మాత్రం కొద్ది రోజుల్లోనే ఈ మహమ్మారి బారి నుంచి బయటపడింది. డ్రాగన్ కంట్రీలోనే పుట్టిన ఈ మహమ్మారి చైనా బయట మాత్రం కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి రోజూ వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలన్నీ విస్తరించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే, చైనీయులు మాత్రం దీని బారి నుంచి చాలా తొందరగానే బయటపడ్డారు. ఇందుకు వారికి ఉపయోగపడింది ‘ఫాలున్ దఫా’ విధానమే. 


ఫాలున్ దఫా అచ్చం మన యోగాను పోలి ఉంటుంది. చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానంతో శరీరం, మనసును అదుపులో పెట్టుకోవడమే ఈ ఫాలున్ దఫా (ఫాలున్ గోంగ్) అభ్యాస లక్ష్యం. ఇందులో ఐదు రకాల సాధారణ వ్యాయామాలు ఉంటాయి. ఇవి చిన్నవే అయినప్పటికీ ఒత్తిడిని జయించడంలోనూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ఇవి చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. అలాగే నిజాయతీ, జాలి, సహనంగా మసలుకోవడం ఎలానో నేర్పుతారు. 


ఫాలున్ దఫా అభ్యాసం వల్ల ఆయుర్ధాయం పెరగడంతోపాటు శరీరంలోని తెల్లరక్తకణాలు మరింత చురుగ్గా కదులుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ లిలి ఫెంగ్ తెలిపారు. చైనాలో ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఎందరినో ఈ ఫాలున్ దఫా బయటపడేసిందని చెబుతున్నారు. ప్రాణాంతక వైరస్ నుంచి చైనా కోలుకోవడంలో ఫాలున్ దఫా పాత్ర ఎంతో ఉందని అంటున్నారు.  భారతీయుల జీవన విధానంలో భాగమైన యోగాను ఇది పోలి ఉండడం, చైనీయుల్లో చాలామంది ఫాలున్ దఫాను ఉపయోగించి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ఇప్పుడు ఈ ఫాలున్ దఫాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-04-03T23:33:53+05:30 IST