Abn logo
Oct 26 2021 @ 23:47PM

‘రైతు భరోసా’ వరం

చెక్కులు విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, స్పీకర్‌ సీతారాం


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: రైతు భరోసా పథకం రైతులకు ఒక వరమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌, సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవలను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించా రు. కలెక్టరేట్‌ నుంచి ఉపముఖ్యమంత్రితో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొని మాట్లాడారు. రైతుభరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలో 3,65,852 మంది రైతులకు రూ.77.71 కోట్లు, ఆర్వోఎఫ్‌ రైతులకు రూ.3.4 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఈ చెక్కులను రైతులకు పంపిణీచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దు వ్వాడ శ్రీనివాస్‌, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, తదితరులు పాల్గొన్నారు.