Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి


పులివెందుల టౌన్‌, డిసెంబరు 2: అప్పుల బాధ తటు ్టకోలేక బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు సజ్జల పెద్ద వెంకటసుబ్బారెడ్డి (70) గురువారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... తొండూరు మండలం తేలూరు వాసి సజ్జల పెద్ద వెంకట సుబ్బారెడ్డి సాగుచేసిన పంటలు చేతికం దక తీవ్రంగా నష్టపోయాడు. సాగుకోసం దాదాపు రూ.15 లక్షలు అప్పులు అయ్యాయని, అప్పు కట్టే పరి స్థితి లేకపోవడంతో మన స్థాపంతో బుధవారం సాయం త్రం 6గంటలకు గుళికలు మింగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికి త్సకు కడప రిమ్స్‌కు తరలించారు. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య అమూల్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. 


 

Advertisement
Advertisement