ఈ కుర్రాడి పేరు సౌరభ్.. Amazon లో కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-21T20:40:45+05:30 IST

అతని పేరు సౌరభ్ కుల్హారీ.. పేద కుటుంబానికి చెందిన అతను తల్లిదండ్రులు రెక్కల కష్టంతో చదువుకున్నాడు..

ఈ కుర్రాడి పేరు సౌరభ్.. Amazon లో కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

అతని పేరు సౌరభ్ కుల్హారీ.. పేద కుటుంబానికి చెందిన అతను తల్లిదండ్రులు రెక్కల కష్టంతో చదువుకున్నాడు.. నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులు సౌరభ్‌ను చదివించేందుకు రాత్రీపగలూ కష్టపడ్డారు.. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న సౌరభ్ ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించాడు.. అక్కడా చదువులో రాణించాడు.. ఏకంగా అమేజాన్‌లో కోటి రూపాయల భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న సౌరభ్ వచ్చే ఏడాది ఉద్యోగంలో జాయిన్ కాబోతున్నాడు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఝుంఝును గ్రామానికి చెందిన సౌరభ్ చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా ఉండేవాడు. కొడుకు ఆసక్తిని అర్థం చేసుకున్న చంద్రకళా దేవి, రాజేష్ కుల్హారి వ్యవసాయం చేసుకుంటూ అతడిని చదివించారు. పదో తరగతి తర్వాత ఐఐటీ కోచింగ్‌కు పంపించారు. దీంతో ఐఐటీ కాన్పూర్‌లో సౌరభ్‌కు సీటొచ్చింది. అక్కడ కూడా సౌరభ్ సత్తా చాటాడు. చివరి సంవత్సరంలో ఉండగా క్యాంపస్ సెలక్షన్స్ మొదలయ్యాయి. అమేజాన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా మెయిల్ వచ్చింది. 


`గత నెల 8వ తేదీన నాకు డెంగ్యూ సోకింది. ప్లేట్‌లెట్స్ పడిపోయాయి. 20 రోజుల పాటు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. 28వ తేదీ రాత్రి నాకు అమేజాన్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది. డిసెంబర్ 2న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా పిలుపు వచ్చింది. అప్పటికి నేను చాలా నీరసంగా ఉన్నాను. అయినా ఇంటర్వ్యూకు హాజరై విజయం సాధించాను. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం నేను ఐఐటీలో చివరి సంవత్సరం చదువుతున్నాను. వచ్చే ఏడాది అమేజాన్ ఆఫీస్‌లో జాయిన్ అవుతాన`ని సౌరభ్ చెప్పాడు.  

Updated Date - 2021-12-21T20:40:45+05:30 IST