సర్కారు సాగుకు సన్నద్ధం

ABN , First Publish Date - 2020-05-30T11:11:46+05:30 IST

జిల్లాలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వానాకాలం పంటల ప్రణాళికకు అనుగుణంగా సాగుకు సిద్ధమ వుతున్నారు.

సర్కారు సాగుకు సన్నద్ధం

జిల్లాలో వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతులు 

ప్రభుత్వ సూచనలతో సన్నరకాలు, సోయాకు మొగ్గు

నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసేందుకు సమాయత్తం


నిజామాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

జిల్లాలో రైతులు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వానాకాలం పంటల ప్రణాళికకు అనుగుణంగా సాగుకు సిద్ధమ వుతున్నారు. కొత్త సాగు విధానంపై ముందునుంచే ప్రచార ం జరుగుతుండడంతో రైతులు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువమంది రైతులు గత కొన్నేళ్లుగా వరి పంటనే సాగు చేస్తున్నారు. ఈ వానాకాలంలో 5.2 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో 3.56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనాకు వచ్చా రు.


ఈ విస్తీర్ణంలో 60 శాతం సన్న రకాలను సాగుచేయించాలని నిర్ణయించారు. గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. సన్నరకాలు సాగుచేయడం వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలుపుతున్నారు. జిల్లాలో జరుగుతు న్న వానాకాలం రైతు సదస్సుల్లో కూడా అధికారులు వివరిస్తున్నారు. సాంబ మసూరి, బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్‌ ఎంటీ, గంగా కావేరి, జైశ్రీరాం వంటి సన్నరకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఇతర సన్నరకాల ను సాగుచేయాలని కోరుతున్నారు. జిల్లాలో బోధన్‌ డివిజన్‌ పరిధిలో గడిచిన 20 రోజుల నుంచే వరి నారుమడులను సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం వానాకాలం లో ఈ డివిజన్‌లో సన్నరకాలను ఎక్కువగా సాగుచేస్తున్నా రు. గంగా కావేరి, సాంబమసూరి, బీపీటీ, జైశ్రీరాం రకాలను సాగుచేస్తున్నారు.


నీటి లభ్యత ఆధారంగా సన్నరకాలను వేస్తున్నారు. దొ డ్డు రకాలతో పోలిస్తే 15 నుంచి నెల రోజుల పా టు ఎక్కువ మొత్తంలో నీళ్లు ఇవ్వాల్సిన అవస రం ఉండడంతో బోర్ల కింద విస్తీర్ణం ఉన్న రైతు లు రెండు రకాలను వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో దొడ్డురకాలను వేసిన రైతులు కూడా నీటి లభ్యత ఆధారంగా సన్నరకాలను సాగుచేసేందు కు సిద్ధమవుతున్నారు. నారుమడుల ను సిద్ధం చేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో గ త సంవత్సరం సక్రమంగా నీరు రాలేదు. ప్రాజెక్టులో నీళ్లు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో సన్న రకాలకు ఇబ్బందులు ఉ న్నా వర్షాకాలంలో వానలు కొంత మేర పడితే బయటపడే అవకాశం ఉండడంతో సన్నరకాలకు మొగ్గుచూపుతున్నారు.


ప్రభుత్వంతో పాటు కలెక్టర్‌, వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిదులు, ఇతర అఽధికారులు పదేపదే చెబుతుండడంతో రైతుల్లో కొంత మార్పు వస్తోంది. నియంత్రిత పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. కొంతవరకు సన్నరకాలు వేయాలని నిర్ణయించుకుంటున్నారు. అదే రీతిలో నారుమడులను వేస్తున్నారు. జిల్లాలో 60 శాతం సన్నరకాలు సాగుచేయాల ని నిర్ణయించినా.. రైతులు మా త్రం రెండింటినీ సమన్వ యం చేసుకుంటూ పండించేందుకు సి ద్ధమవుతున్నారు. మొక్కజొన్నకు బదులు ఇతర పంటలు వేసే ందుకు రైతు లు ముందుకు వస్తున్నారు. కొ ంత మంది రైతులు మొక్కజొ న్న వైపే మొగ్గుచూపుతున్నా.. మిగతా రైతులు మాత్రం సోయాకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో గతంలో 65 వేల ఎకరాల్లో సోయా పంట వేయగా.. ఈ వానాకాలంలో లక్షా 10 వేల ఎకరాల్లో ఈ పంటను వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోయా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు.


మొక్కజొన్నకు బదులు కంది, పెసర, శనగ పంట లు వేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు పత్తిని కూడా సాగు చేయాలని కోరుతున్నారు. జిల్లా పంటల విస్తీర్ణంలో 60 శాతానిపైగా వరి సాగే ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో వరిని పండించే రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూరగాయలను కూడా ఎక్కువగా సాగుకు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల సాగు పెరిగితే మార్కెట్‌ సౌకర్యా న్ని కూడా కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం గా ప్రభుత్వం పంటల మార్పు చేయాలని కోరడంతో దానికి అనుగుణంగానే జిల్లాలో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 


నీటి లభ్యత ఆధారంగానే సన్నరకాలు..శ్రీనివాస్‌, వర్ని

గతంలో దొడ్డురకాలు సాగు చేశాను. ప్రస్తుతం నీటి లభ్యత ఆధారంగా సన్నాలు సగం, దొడ్డు సగం చేసేందుకు సిద్ధమవుతు న్నా. నారు పోస్తున్నాను. సన్న ర కం వేస్తే నీళ్లు ఎక్కువగా కావా ల్సి వస్తుంది. ఎక్కువ రోజులు సమయం పడుతుంది. రెండు రకాలను సాగు చేస్తే నీటికొరత ఉండకపోవడంతో పాటు లాభం ఉంటుందని నిర్ణ యం తీసుకున్నాను.


బోర్ల కింద సన్నరకంతో ఇబ్బందులే..మోహన్‌రెడ్డి, ఎరాజ్‌పల్లి, బోధన్‌

బోర్ల కింద నీటి కొరత ఉంటుం ది. మొత్తం సన్నరకాలు వేయాలం టే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్ర భుత్వం నిర్ణయించినా నీటి లభ్యత ఆధారంగానే వరి సాగు చేస్తాం. దొ డ్డురకాలు వేస్తే రోగాలను తట్టుకుంటుంది. సన్నరకం వేస్తే గొలు సు వచ్చే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రైతులకు పంటలు వేసే నిర్ణయాన్ని తీసుకోనివ్వాలి. 


సన్న రకాలతోనే లాభాలు..గోవింద్‌, జేడీఏ

జిల్లాలో సన్నరకాలు సాగుచేస్తే నే రైతులకు లాభం జరుగుతుంది. బయటి మార్కెట్‌లో డిమాండ్‌ ఉం టుంది. జిల్లాలో 60 శాతం సన్నరకాలను సాగు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - 2020-05-30T11:11:46+05:30 IST