Abn logo
Jun 15 2021 @ 14:09PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలోని చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డి పేట, ఇల్లంతుకుంట తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉంచిన ధాన్యం తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.