రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి

ABN , First Publish Date - 2021-06-19T06:41:53+05:30 IST

రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి లాభాలు పొందాలని ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య సూచించారు.

రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి
రైతు వేదికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల, జూన 18 : రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించి లాభాలు పొందాలని ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం చిట్యాలలో లబ్ధిదారులకు కల్యాణల క్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, చేపల పెంపకంపై రైతు లు దృష్టి సారించాలన్నారు. హరితహారం కింద పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకంతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంట లు పండుతున్నాయన్నారు. కేసీఆర్‌ పాలన తెలంగాణకు వరమని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పఽథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన కూరెళ్ల లింగస్వామి, సర్పంచ శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్‌ చైర్మన ఆదిమల్లయ్య, ఎంపీటీసీ సత్తయ్య, తహసీల్దార్‌ కృష్ణారెడ్డి, ఎంపీడీవో లాజర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T06:41:53+05:30 IST