రైతులు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-09-21T07:15:57+05:30 IST

రైతులు బ్యాంకుల్లో కేవలం పంట రు ణాలు మాత్రమే తీసుకొని తిరిగి చెల్లించగా అప్పుల పాలవుతూ బ్యాం కు సేవలను నష్టపోతున్నారని

రైతులు బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి

ఎస్‌బీఐ ఆర్‌ఎం పల్లంరాజు


కోటగిరి, సెప్టెంబరు 20 : రైతులు బ్యాంకుల్లో కేవలం పంట రు ణాలు మాత్రమే తీసుకొని తిరిగి చెల్లించగా అప్పుల పాలవుతూ బ్యాం కు సేవలను నష్టపోతున్నారని రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు ద్వారా అందే సేవలను మరిన్ని పొందాలని ఎస్‌బీఐ ఆర్‌ఎం పల్లంరా జు సూచించారు. కోటగిరి మండలంలోని హంగర్గఫారం గ్రామంలో ఆదివారం రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో సుమారు 1200 మంది రైతు లు తమ పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకొక నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ రాయితీని పొం దలేని పరిస్థితి నెలకొందన్నారు. తీసుకున్న రుణాలను ఏడాదిలోపు చెల్లిస్తే ఏడుశాతం వడ్డీ పడుతుందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీని ఇస్తుందన్నారు. తీసుకున్న రుణాలను స కాలంలో చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ లభిస్తుందన్నారు. కొందరు రైతులు పంట రుణాలు తీసుకొని బ్యాంకుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.


వడ్డీలు పెరిగిపోవడంతోపాటు ప్రభుత్వం అం దించే రుణమాఫీవంటి సౌకర్యాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. బ్యాంకు కేవలం పంట రుణాలకు మాత్రమే పరిమితం కాదని మహి ళలకు డ్వాక్రా రుణాలు, గృహ, విద్య, ఉపాధివంటి అనేక రంగాలకు రుణాలు అందిస్తుందని అన్నారు. రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ సకాలంలో చెల్లిస్తే అటు బ్యాంకుతోపాటు ఇటు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రానున్న రోజుల్లో యోనో యాప్‌ ద్వారానే సేవలు అందించే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ప్రజలకు బ్యాంకు సేవలు చేరువ చేసేందుకు కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజాప్రతినిధులు రైతులకు పంట రుణాల రెన్యూవ ల్‌పై మరింత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్ర మంలో ఎస్‌బీఐ మేనేజర్‌ వీరప్ప, బ్యాంకు అధికారి రమేష్‌, సర్పంచ్‌ ఏజాజ్‌ఖాన్‌, మాజీ ఎంపీటీసీ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-21T07:15:57+05:30 IST