రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలి

ABN , First Publish Date - 2021-04-14T05:22:41+05:30 IST

రైతులు పంటల సాగులో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని ఉద్యాన శాఖ అధికారి రాఘవేం ద్రారెడ్డి సూచించారు.

రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలి
ఉలిమెల్లలో భూమిపూజ నిర్వహిస్తున్న ఎంఆర్‌పీ మస్తాన, రైతులు

పులివెందుల రూరల్‌, ఏప్రిల్‌ 13: రైతులు పంటల సాగులో ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని ఉద్యాన శాఖ అధికారి రాఘవేం ద్రారెడ్డి సూచించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళ వారం  ఉలిమెల్లలో శ్రీకర్షక ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ, ప్రకృతి వ్య వసాయ మండల రిసోర్స్‌ పర్సన మస్తాన ఆధ్వర్యంలో భూమిపూజ, గోపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు పొలాల్లోని మట్టిని తీసుకొచ్చి  కుప్పగా పోసి దానిపై కలశం ఉంచి పూజ నిర్వహించారు. పూజ అనంతరం గోమాతను, భూమాతను పంచామృతాలతో పూజిం చారు. రాశిగా పోసిన మట్టిపై జీవామృతం పంచగవ్య పోసి కలిపి ఆ మట్టిని తీసుకెళ్లి పొలాల్లో చల్లుకోవాలని తెలియజేశారు.

కార్యక్రమంలో పులివెందుల మండల ప్రకృతి వ్యవసాయ మండల రిసోర్స్‌ పర్సన మ స్తాన, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1

Updated Date - 2021-04-14T05:22:41+05:30 IST