రైతులు ఆందోళన చెందవద్దు: మిడతల రాష్ట్ర పరిశీలన బృందం

ABN , First Publish Date - 2020-06-01T09:34:37+05:30 IST

ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే త్వరలో మిడతల దండుకూడా రైతులపై ప్రభావం చూపనున్నట్లు

రైతులు ఆందోళన చెందవద్దు: మిడతల రాష్ట్ర పరిశీలన బృందం

ఆదిలాబాద్‌టౌన్‌, మే 31: ఇప్పటికే కరోనా వైరస్‌తో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే త్వరలో మిడతల దండుకూడా రైతులపై ప్రభావం చూపనున్నట్లు కథనాలు వస్తున్నాయని అయితే రైతులు, ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మిడతల పరిశీలన బృందం సభ్యులు స్పష్టం చేశారు. మిడతల నివారణ కోసం ప్రభుత్వం నియ మించిన అధికారుల బృందం ఆదివారం జిల్లాలో పర్యటించింది. ముం దుగా రామగుండం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిక్యాప్టర్‌లో అధికారుల బృందం జిల్లాకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్‌లో హెలిక్యాప్టర్‌ ద్వారా దిగిన అధికారుల బృందం నేరుగా జిల్లా కేంద్రం లోని టీటీడీసీ విశ్రాంతి భవనానికి చేరుకున్నారు.


ఈ బృందంలో శాస్త్రవేత్తలు సునీత, రహమాన్‌, వరంగల్‌ సీసీఎఫ్‌ అక్బర్‌, మంచిర్యాల్‌ కలెక్టర్‌ భారతి హోలికేరి, రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారాయణలకు కలెక్టర్‌ శ్రీదేవసేన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ఈ అధికారుల బృందం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలకు చెందిన అధికారులతో మిడతల నివారణ చర్యలపై, తీసుకునే జాగ్ర త్తలు, రైతులకు కల్పించే అవగాహనపై సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ  సందర్భంగా శాస్త్రవేత్తలు రహమాన్‌, సునీత మీడి యాతో మాట్లాడారు. మిడతల రాకపై సోషల్‌ మీడియాలో, కొన్ని పత్రి కలు, చానళ్లతో అనేక అపోహల వల్ల వార్త కథనాలు ప్రసారమ వుతున్నాయన్నారు. దీంతో ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా కుంగిపోయిన రైతులు, ప్రజలలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా మిడతల దండు ప్రవేశించలేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ఈ అపోహలను నమ్మొద్దని సూచించారు. మీడియా కూడా మిడతల దండు రాకపై అసత్య వార్తలను ప్రసారం చేయవద్దని కోరారు. 


కలవర పెట్టిన స్థానిక మిడత..

ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిడతల ప్రభావం ఉండకూడదని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం అధికారులు జిల్లా కేంద్రానికి చేరుకోగానే వారికి హెలిక్యాప్టర్‌ నుంచి అడుగు దూరం నడిచిన తర్వాత స్థానికంగా మిడత రాష్ట్ర బృందాన్ని కలవర పెట్టింది. వారు పయనించే వాహనంపై మిడత పడడంతో చూసిన అధికారుల బృందం ఇది స్థానిక మిడత అని ఇందులో నాలుగు నుంచి ఐదు రకాల గ్రేడుల మిడతలు ఉంటాయని, స్థానిక మిడత వల్ల రైతులకు, ప్రజలకు ఎలాంటి నష్టం లేదని వివరించారు. 

Updated Date - 2020-06-01T09:34:37+05:30 IST