Advertisement
Advertisement
Abn logo
Advertisement

11 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు కూతుళ్లు కూడా.. అయినా ఆ భర్తకు ఇదేం పాడుబుద్ధి.. భార్యకు అలాంటి వీడియోలు చూపిస్తూ..

ఇంటర్నెట్ డెస్క్: అతనికి 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.. నీలి చిత్రాలకు బానిసగా మారిన ఆ వ్యక్తి భార్యను వేధించడం ప్రారంభించాడు.. పోర్న్ వీడియోల్లో ఉన్నట్టు చేయమని భార్యను హింసించేవాడు.. ఆల్కహాల్ తాగి శృంగారం చేయాలని బలవంతం పెట్టేవాడు.. గత మూడు నెలలుగా ఆ హింస మరింత పెరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. భర్త పై ఫిర్యాదు చేసింది.. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


హోసంగాబాద్‌కు చెందిన 35 ఏళ్ల బాధిత మహిళ భర్త స్థానిక పేపర్ మిల్లులో పని చేస్తున్నాడు. 11 ఏళ్ల క్రితం వీరిద్దరికీ వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ వ్యక్తి మద్యానికి, నీలి చిత్రాలకు బానిసగా మరాడు. ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తూ వాటిల్లో మహిళలు చేసే విధంగా చేయమని భార్యను హింసించడం మొదలుపెట్టాడు. ఆల్కహాల్ తాగి శృంగారం చేయమని భార్యను బలవంత పెట్టేవాడు. ఇన్నాళ్లూ బాధిత మహిళ భయంతో భర్త ఆగడాలను భరించింది. 


గత మూడు నెలలుగా అతడి ఆగడాలు మరింత ముదిరాయి. పిల్లల ఎదుటే అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్త గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు.Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement