కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-21T05:05:41+05:30 IST

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఆత్యహత్య చేసుకున్నాడు.

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆత్మహత్య
ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకటరమణ

ములకలచెరువు, జనవరి 20: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కాలువపల్లె పంచాయతీ పెద్దపల్లెకు చెందిన వెంకటరమణ(45) దినసరి కూలీ. ఈయన కుమార్తె ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఇంటికి రావాలని రెండు రోజులుగా కుమార్తెను బతిమలాడాడు. ఆమె రాలేదు. దీంతో మనస్తాపానికి గురై మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు.  కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమిం చడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్‌ఐ రామకృష్ణ పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నారు. 




Updated Date - 2022-01-21T05:05:41+05:30 IST