హైదరాబాద్‌లో క్షణ క్షణం.. భయం భయం..!

ABN , First Publish Date - 2020-10-20T18:44:38+05:30 IST

ఇప్పటికీ జలగండంలో అనేక బస్తీలు, కాలనీలు ఎంతటి మహానగరం అయినా.. దానికి ఉన్న వనరులు ఎంతటివి అయినా.. ప్రకృతి ముందు ఎంత అల్పమో ఈ వారం మరొకసారి రుజువు చేసింది. దాడి చేసినట్లు కురిసిన వాన ధాటికి లక్షలాది మంది ప్రజానీకం విలవిలలాడారు.

హైదరాబాద్‌లో క్షణ క్షణం.. భయం భయం..!

మళ్లీ వర్షాలొస్తే.. ప్రమాదమే.. ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న జనం

కొందరు తాత్కాలికంగా బంధువుల దగ్గరికి...

మరికొందరు సురక్షితం అనుకున్న ప్రాంతాలకు అద్దె ఇళ్లు తీసుకుని...

ఈ మూడు రోజులూ వర్షాలుండవచ్చన్న వాతావరణ శాఖ

భయం భయంగా నగరం.. భయానకంగా శివారు ప్రాంతాలు కొన్ని


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇప్పటికీ జలగండంలో అనేక బస్తీలు, కాలనీలు ఎంతటి మహానగరం అయినా.. దానికి ఉన్న వనరులు ఎంతటివి అయినా.. ప్రకృతి ముందు ఎంత అల్పమో ఈ వారం మరొకసారి రుజువు చేసింది. దాడి చేసినట్లు కురిసిన వాన ధాటికి లక్షలాది మంది ప్రజానీకం విలవిలలాడారు. ఇంకా కొన్ని ప్రాంతాలు వరదల్లోనే చిక్కుకుని ఉన్నాయి. ఈ మూడు రోజులూ వర్షాల హెచ్చరిక ఉండడంతో.. హైదరాబాద్ నగర జీవి క్షణక్షణం భయంతో బతుకుతున్నాడు.


నీట మునిగిన కాలనీలు..

రామంతాపూర్‌ పెద్ద చెరువు, చిన్న చెరువు, మూసీ నాలాలో చేరిన వరద నీటి కారణంగా లోతట్టు ప్రాంతాలలోని కాలనీలైన రవీంద్రనగర్‌, సాయిచిత్రనగర్‌, లక్ష్మీనగర్‌, మహేశ్వరీనగర్‌, ప్రగతినగర్‌, ఇందిరానగర్‌, నేతాజీనగర్‌, శాంతినగర్‌, సత్యనగర్‌, కేసీఆర్‌నగర్‌ ప్రాంతాలు నీటిలో మునిగాయి. ఇళ్లలో, రోడ్లపై ఎటు చూసిన వరద నీరే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా ఇళ్లలోని వస్తువులతో పాటు బియ్యం, పప్పు దినుసులు, నిత్యావసర సరుకులు, దుస్తులు తడిసి ముద్ద కావడంతో ముంపు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో తిండి తిప్పలు లేక విలవిలలాడుతున్నారు. పలు కాలనీలలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కారణంగా చీకటిలో మగ్గుతున్నామని, బయట అడుగు పెట్టాలంటేనే భయంగా ఉందని ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ పొంగి పొర్లి ము రుగు నీరు ఇండ్ల ముందుకు చేరడంతో తీవ్ర దుర్గంధంతో అవస్థలు పడుతున్నామని, అధికారులు అరకొర సహాయక చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. తమ పరిస్థితి దయనీయంగా మారిందని, అధికార యంత్రాంగం తమ కాలనీలలో వరద నీటిని యుద్ద ప్రాతిపదికన తొలగించి సహాయక చర్యలను ముమ్మరం చేసి తమను ఆదుకోవాలని ముంపు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. పలు ముంపు ప్రాంతాల ప్రజలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ బృందా లు బోట్ల ద్వారా  సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.


బాధితులకు సీఎం రిలీఫ్‌ కిట్లు

రామంతాపూర్‌ డివిజన్‌ పరిధి ఇందిరానగర్‌, నేతాజీనగర్‌, కురుమనగర్‌, కేసీఆర్‌నగర్‌ బాధితులకు సీఎం రిలీఫ్‌ కిట్‌లను, దుప్పట్లను ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావులు పంపిణీ చేశారు.  ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారు హామీనిచ్చారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ ప్రాజెక్టు అధికారిణి రమాదేవి, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ డైరెక్టర్‌ శాగ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్‌, నాయకులు తవిడబోయిన గిరిబాబు, భిక్షపతిచారి, కృష్ణారెడ్డి, సమద్‌ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎం.డి. రఫీక్‌ ఆధ్వర్యంలో పాలు, బ్రెడ్‌లను, శాగ రవీందర్‌ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు ఆహారపు పొట్లాలను అందించారు. 


బీఎస్‌ఆర్‌ సంస్థ సభ్యుల పర్యటన 

హబ్సిగూడ డివిజన్‌ పరిధిలోని ముంపు ప్రాంతాలలో టీమ్‌ బీఎ్‌సఆర్‌ స్వచ్చంద సంస్థ సభ్యులు పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకుని వారిని ఆదుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు భేతి సుమంత్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నందికంటి శివ, దాచేపల్లి శ్రీధర్‌, సుద్దాల నాని తదితరులు పాల్గొన్నారు.  


నాలాల్లో వ్యర్థాల తొలగింపు

మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలో నీట మునిగిన కాలనీల్లో కార్పొరేటర్‌ జగదీ్‌షగౌడ్‌ సహాయక చర్యలు చేపట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను పారిశుధ్య కార్మికులతో తొలగింపజేశారు. నాలాల్లో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించారు. సర్థార్‌పటేల్‌నగర్‌, దుర్గానగర్‌, చర్చిగల్లీ తదితర ప్రాంతాల్లో సోమవారం ఆయన సహాయక చర్యలు చేపట్టారు.  


వెంకటాపురం డివిజన్‌ పరిధి శివానగర్‌ కల్వర్టుకు అడ్డుపడిన చెత్తాచెదారాన్ని కార్పొరేటర్‌ సబితాకిషోర్‌ శుభ్రం చేయించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది పనులు చేస్తుండగా, డీఈ విరాట్‌తో కలిసి కార్పొరేటర్‌ పర్యవేక్షించారు. స్థానికంగా సోడియం హైపోక్లోరైడ్‌, క్రిమిసంహారక ద్రావణాలను పిచికారీ చేయించారు. కార్యక్రమంలో ఏఈ అరుణ్‌, వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకట్‌రావు, కాలనీవాసులు మల్లికార్జున్‌, జనార్దన్‌, శివ, ప్రభాకర్‌, రాజేశ్‌గౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


సీఎం రిలీఫ్‌ కిట్లు పంపిణీ 

అల్వాల్‌ డివిజన్‌ పరిధి రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో వరద బాధితులకు కార్పొరేటర్‌ శాంతిశ్రీనివా్‌సరెడ్డి  సీఎం రిలీఫ్‌ కిట్లను అందజేశారు. 


కార్పొరేటర్‌ పర్యటన

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని  సైనిక్‌ విహార్‌లో కార్పొరేటర్‌ కె.శ్రీదేవి పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్నారు. 


నిత్యావసర వస్తువుల పంపిణీ 

అల్వాల్‌ డివిజన్‌లోని వరద బాధితులకు బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు కార్తీక్‌గౌడ్‌ సోమవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భారతీనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 50 మందికి వీటిని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు  విక్రమ్‌సాయి, సంతోష్‌, రాజేశ్‌ తదితరులు  పాల్గొన్నారు.  


ముంపు ప్రాంతాలలో వైద్య సేవలు

ముంపు ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని జవహర్‌నగర్‌ మేయర్‌ కావ్వ అన్నారు. అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఆధ్వర్యంలో మల్కారంలో డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ నేతి మంగమ్మతో కలిసి మేయర్‌ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాజ్‌కుమార్‌, వైద్యసిబ్బంది షోకత్‌ తదితరులు పాల్గొన్నారు. 


సీఎం రిలీఫ్‌ కిట్ల పంపిణీ

లోతట్టు ప్రాంతాల వారికి ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పావనీరెడ్డి సీఎం రిలీఫ్‌ కిట్లను పంపిణీ చేశారు. మారుతీనగర్‌ నాలా పక్కన ఉన్న పూరి గుడిసె వాసులకు నిత్యావసర వస్తువులను,  దుప్పట్లను పం పిణీ చేశారు.  వార్డు కార్యాలయంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పుస్తకాలు తడిసిపోయాయని కొందరు విద్యార్థులు కార్పొరేటర్‌ దృష్టికి తీసుకురాగా కొత్త పుస్తకాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు షేర్‌ మణే మ్మ, పి.మణిపాల్‌రెడ్డి, గోవర్ణన్‌, శిరీషారెడ్డి పాల్గొన్నారు. 


నాలా విస్తరించాలి

ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ పరిధి సత్తిరెడ్డి కాలనీలో నాలా విస్తరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం టీజేఏసీ మల్కాజిగిరి చైర్మన్‌ శోభన్‌బాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నాలాలు ఇరుకుగా ఉండటంతో వరద నీరు కాలనీలను ముంచెత్తుతోందని, దీంతో స్థానికులు కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.  



Updated Date - 2020-10-20T18:44:38+05:30 IST