మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-01-18T05:32:39+05:30 IST

చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషనలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డు ఆదివారం స్టేషనకు కూతవేటు దూరంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఎర్రముక్కపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యనారాయణమ్మ

కడప (క్రైం), జనవరి 17: చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషనలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డు ఆదివారం స్టేషనకు కూతవేటు దూరంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఎర్రముక్కపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కడపకు చెందిన సూర్యనారాయణమ్మ చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషనలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. హోంగార్డు ఇనచార్జ్‌ అధికారి ఆమెకు ఓ పోలీసు ఉన్నతాధికారికి వంట చేసేందుకు విధులు కేటాయించినట్లు సమాచారం. అయితే ఆమె ఆదివారం ఆ విధులకు హాజరై తిరిగి సీకేదిన్నె స్టేషనకు వెళుతూ స్టేషన సమీపంలోకి రాగానే నిద్రమాత్రలు మింగి పడిపోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా.. లేక అధికారుల వేధింపులు తాళలేకనా అన్న విషయం తెలియాల్సి ఉంది. హోంగార్డు అపస్మారక స్థితిలో ఉండడంతో పూర్తి సమాచారం తెలియరాలేదు. కాగా ఈమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2021-01-18T05:32:39+05:30 IST