ఘనంగా గౌరీపరమేశ్వర ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-05T05:15:00+05:30 IST

గౌరీ సేవా సంఘం ఆద్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర మహోత్సవాలలో బాగంగా శుక్రవారం సారె ఊరేగింపు నిర్వహించారు.

ఘనంగా గౌరీపరమేశ్వర ఉత్సవాలు
గౌరీ పరమేశ్వరులకు సారె ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు

అక్కిరెడ్డిపాలెం: గౌరీ సేవా సంఘం ఆద్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర మహోత్సవాలలో బాగంగా శుక్రవారం సారె ఊరేగింపు నిర్వహించారు. అరిసెలు, బూరెలు వంటి వంటకాలతో పాటు అనేక రకాల స్వీట్లు, వివిద రకాల పండ్లు, పూలను మహిళలు పళ్లాల్లో అమర్చి తలపై పెట్టుకొని మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు.  సంఘ అద్యక్షులు దాడి వెంకట రమేశ్‌, కాండ్రేగుల జగ్గ అప్పారావు, కేజీ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:15:00+05:30 IST