వధువును షాపింగ్‌కు తీసుకువెళ్లి చంపేసిన వరుడు

ABN , First Publish Date - 2021-06-16T15:25:58+05:30 IST

ఐదు రోజుల్లో పెళ్లి జరగనుండగా కాబోయే వధువును షాపింగ్ కు తీసుకువెళ్లి....

వధువును షాపింగ్‌కు తీసుకువెళ్లి చంపేసిన వరుడు

మొరాదాబాద్ (ఉత్తరప్రదేశ్): ఐదు రోజుల్లో పెళ్లి జరగనుండగా కాబోయే వధువును షాపింగ్ కు తీసుకువెళ్లి , ఆమెను హతమార్చిన వరుడి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో వెలుగుచూసింది. టీనా అనే యువతికి తనకు కాబోయే భర్త, వరుడు జితిన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి వేడుక కోసం చీరలు కొనడానికి రమ్మని జితిన్ తనకు కాబోయే భార్య టీనాను కోరాడు. షాపింగ్ కోసం వచ్చిన టీనాను కాబోయే వరుడు జితిన్ హత్య చేశాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో టీనా మృతదేహం గ్రామం వెలుపల రోడ్డుపై పడి ఉంది. జితిన్ ను కలిసిన టీనా మరణించిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. టీనాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమెను జితిన్ హత్య చేశాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. చీరలు కొనడానికి పిలిచి టీనాను జితిన్ గొంతు కోసి చంపాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-16T15:25:58+05:30 IST