సినీ గేయ రచయిత రవికిరణ్‌కు పాముకాటు

ABN , First Publish Date - 2021-10-24T06:56:34+05:30 IST

బెండమూర్లంకకు చెందిన సినీ గేయ రచయిత పోతుల రవికిరణ్‌(50) పాముకాటు కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోనే తన ఇంటి వద్ద ఉండగా శనివారం ఆయనను తాచు పాము కాటు వేయగా అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

సినీ గేయ రచయిత రవికిరణ్‌కు పాముకాటు

అల్లవరం, అక్టోబరు 23: బెండమూర్లంకకు చెందిన సినీ గేయ రచయిత పోతుల రవికిరణ్‌(50) పాముకాటు కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోనే తన ఇంటి వద్ద ఉండగా శనివారం ఆయనను తాచు పాము కాటు వేయగా అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యంకోసం కిమ్స్‌ ఆస్పత్రికి తర లించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు తెలిపారు. 16ఏళ్లుగా ఆయన 350కి పైగా సినిమాలకు పాటలు రాశారు. కరోనాతో ఏడాదిగా ఇంటి వద్దే ఉంటూ సినిమా పాటలు రాస్తున్నారు.

Updated Date - 2021-10-24T06:56:34+05:30 IST