Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. దోచుకున్న అనంతరం వంట గదిలో చేసిన చిన్న పనితో.. చివరకు

కొందరు దొంగలు విచిత్రంగా ఉంటారు. వచ్చిన పని మర్చిపోయి.. ఏవేవో చేసి చివరికి అడ్డంగా బుక్కవుతుంటారు. కొన్ని నేరాల్లో ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా నేరస్థులు తప్పించుకుని తిరుగుతుంటారు. ఒక్కోసారి ఎంత నేరం చేసినా.. చిన్న క్లూతో దొరికిపోతుంటారు. అస్సాంలో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ చేసిన నిర్వాకం.. చివరికి అతన్ని పోలీసులకు పట్టించింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

అస్సాం గువాహటిలోని హెంగకెరాబారి ప్రాంతంలో అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. నగలు, నగదును మొత్తం సర్దుకున్నాడు. అయితే అప్పటికే ఆకలితో ఉన్న అతనికి, ఏదైనా తినాలనిపించింది. వంట గదిలోకి వెళ్లి మొత్తం వెతికాడు. కానీ ఏవీ లేకపోవడంతో.. తానే సొంతంగా వంట చేస్తే పోలా, అని అనుకున్నాడు. రుచికరమైన కిచిడీ చేసుకుని తిని వెళ్దామనుకున్నాడు. అందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ పోగేసుకున్నాడు. పొయ్యి వెలిగించి వంట ప్రారంభించాడు. అయితే వంట చేసే క్రమంలో శబ్ధాలు రావడంతో పక్కింటి వారికి అనుమానం వచ్చింది.

19ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. ఒక్కసారిగా రూ.8కోట్లు దక్కడంతో..

తాళాలు పగులకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే వంట గదిలో బిజీగా ఉన్న దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనను వర్ణిస్తూ అస్సాం పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో ఆసక్తికరంగా పోస్టు పెట్టారు. కిచిడీ ఆరోగ్యానికి మంచిదైనా.. ‘‘దొంగతనానికి వెళ్లిన సమయంలో కిచిడీ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు’’ అంటూ సరదాగా చమత్కరించారు. ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. 

అక్కా చెల్లెళ్లు చేసిన నిర్వాకం.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని ఊరి బయటకు రమ్మని.. మరుసటి రోజు చూసేసరికి..ఇవి కూడా చదవండిImage Caption

Viral Video: సింహాలతో సరదా సరదాగా మహిళ వాకింగ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..ఫిబ్రవరిలో పెళ్లి ఉండగా... ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని.. వరుడు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు వెళ్లిందంటే..ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..నన్నే మాస్కు పెట్టుకోలేదని అడుగుతావా... అంటూ ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే.. ఈ కోతి ఎంత పని చేసింది.. తలుపులు వేయని ఇంట్లోకి చొరబడి.. నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకెళ్లి..
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement