Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాన్‌ ఓవెన్‌ ఫ్యాక్టరీ ఆహుతి రూ.50 లక్షల నష్టం

కలికిరి, నవంబరు 30: అగ్ని ప్రమాదం కారణంగా  పట్టణంలోని నాన్‌ ఓవెన్‌ ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధమైపోయింది. విలువైన యంత్రాలు ముడిసరుకులతో సహా మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో దాదాపు రూ. 50 లక్షల విలువై ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. పట్టణానికి చెందిన అజయ్‌కుమార్‌ స్థానిక మువ్వల మిషన్‌ కాంపౌండ్‌లో అజయ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో మూడేళ్ల క్రితం నాన్‌ ఓవెన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్లాస్టిక్‌ రహిత చేతి సంచులు, గిఫ్ట్‌ బ్యాగులు తదితర వివిధ రకాల ప్యాకింగ్‌ సామగ్రిని తయారు చేసి రాయలసీమ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నాడు. వీటి తయారీ కోసం ఆధునిక విదేశీ యంత్రాలను ఏర్పాటు చేశాడు. సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ ఆల యం వద్ద ఒక విద్యుత్‌ స్తంభాన్ని లారీ ఢీకొనడంతో కరెంటు సరఫరా ఆగిపోయింది. ఫ్యాక్టరీలో పనిచేసే వారు కొన్ని యంత్రాలను పొరపాటున ఆన్‌లోనే వుంచి ఫ్యాక్టరీ మూసేసి సాయంత్రం వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిది తరువాత సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్‌ పునరుద్ధరణతో యంత్రాలు వాటంతట అవే పనిచేయడం ప్రారంభించి షార్ట్‌సర్క్యూట్‌ జరిగి పరిశ్రమ కాలిపోయినట్లు తెలుస్తోంది.    

Advertisement
Advertisement