Abn logo
Apr 8 2021 @ 10:34AM

ఢిల్లీ పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ పారిశ్రామికవాడలో గురువారం స్టేషనరీ గోదాంలో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దామోదర్ పార్కు ఎంటీఎన్ఎల్ కార్యాలయ భవన సమీపంలోని గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంతో మంటలు వ్యాపించాయి.అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే 15 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, కాని ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement