Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రాయలసీమ’లో అగ్ని ప్రమాదం

తప్పిన భారీ నష్టం

గుంతకల్లు, డిసెంబరు 5: తిరుపతి-నిజామాబాద్‌ వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 12793)లోని ఓ బోగీలో నిప్పురవ్వలు ఎగసిపడగా సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపి మంటలను ఆర్పేశారు. ఆదివారం రాత్రి ఓబుళవారిపల్లి-రెడ్డిపల్లి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు చివరి బోగీలో ఉన్న ఏసీ కార్‌కు కింద భాగాన సాంకేతిక సమస్య ఏర్పడి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. మంట కారణంగా ఈ బోగీకి ఆనుకుని ఉన్న మూడు ఏసీ కోచలలో పొగ వ్యాపించింది. దీంతో ఏసీ బోగీల్లోని ప్రయాణికులు భయాందోళన చెందారు. గమనించిన గార్డు రైలును ఆపివేయగా, సిబ్బంది మంటలను ఆర్పి, ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దాదాపు 45 నిమిషాలసేపు రైలు నిలిచిపోయింది. సమస్య పరిష్కారం కావడంతో రైలును ముందుకు నడిపారు. ఎవరికీ ఎటు వంటి ప్రమాదం జరగలేదు. భారీ నష్టం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. 

Advertisement
Advertisement