ఇన్విట్రో టెక్నిక్ సాయంతో రెండు కూనలకు జన్మనిచ్చిన సరోగేట్ చిరుత

ABN , First Publish Date - 2020-02-26T15:36:07+05:30 IST

ప్రపంచంలో 30 ఏళ్ల తరువాత తొలిసారి ఇన్విట్రో టెక్నిక్ సాయంతో సరోగేట్ మదర్‌గా మారిన చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఈ కూనల బయోలాజికల్ మదర్, ఆరేళ్ల చిరుత పేరు కిబీబీ. ఇది తల్లికాలేకపోయింది. దీనికితోడు ప్రాకృతికంగానూ...

ఇన్విట్రో టెక్నిక్ సాయంతో రెండు కూనలకు జన్మనిచ్చిన సరోగేట్ చిరుత

పోవెల్(ఓహియో): ప్రపంచంలో 30 ఏళ్ల తరువాత తొలిసారి ఇన్విట్రో టెక్నిక్ సాయంతో సరోగేట్ మదర్‌గా మారిన చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఈ కూనల బయోలాజికల్ మదర్, ఆరేళ్ల చిరుత పేరు కిబీబీ. ఇది తల్లికాలేకపోయింది. దీనికితోడు ప్రాకృతికంగానూ దానికి తల్లి అయ్యే వయసు కూడా దాటిపోయింది. దీంతో కిబీబీ నుంచి అండాన్ని, మరో మగ చిరుత నుంచి శుక్రకణాలను సేకరించి వాటిని కొలంబస్ జూ ల్యాబొరేటరీలో నవంబరు 19న ఫలదీకరణ చేశారు. ఈ భ్రూణాన్ని నవంబరు 21న సరోగేట్ చిరుత సజ్జీలో ప్రవేశపెట్టారు. తరువాత డిసెంబరు 23న అల్ట్రసౌండ్ పరీక్ష నిర్వహించగా, ఇజ్జీ గర్భం దాల్చిందని తేలింది. పైగా దాని కడుపులో రెండు చిరుతలు ఉన్నాయని వెల్లడయ్యింది. గర్భధారణ జరిగిన మూడు నెలల తరువాత ఇజ్జీ ఒక మగ, ఒక ఆడ చిరుత కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొలంబస్ జూ అధికారులు వెల్లడించారు. జూపార్కుకు చెందిన పశువైద్యులు డాక్టర్ రాండి జంగ్ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ద్వారా విభిన్న ప్రజాతుల మనుగడకు ఊతం అందుతుందన్నారు.  



Updated Date - 2020-02-26T15:36:07+05:30 IST