బంగ్లాదేశ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా రోగుల మృతి

ABN , First Publish Date - 2020-05-28T23:13:34+05:30 IST

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆసుపత్రిలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా వైరస్ రోగులు

బంగ్లాదేశ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా రోగుల మృతి

ఢాకా:  బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆసుపత్రిలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటలో మంటలను అదుపు చేశారు. యునైటెడ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల్లో ఐదుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు ఫైర్ సర్వీస్ డైరెక్టర్ రహ్మన్ తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉందని, వారి వయసు 45 నుంచి 75 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 


బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 38,292 కేసులు నమోదు కాగా, 544 మరణాలు సంభవించాయి. అయితే, దేశంలో నిజానికి కేసుల సంఖ్య 160 మిలియన్లకు పైగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  

Updated Date - 2020-05-28T23:13:34+05:30 IST