Abn logo
Oct 30 2020 @ 04:27AM

2.85 లక్షల మందికి పరిహారం అందజేత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వరద ముంపునకు గురైన కుటుంబాలను గురువారం సాయంత్రం వరకు 3,91,966 గుర్తించారు. నగరంలోని 1572 కాలనీలు వరద ముంపునకు ప్రభావితమవ్వగా, ఆయా కాలనీల్లోని కుటుంబాలు ముంపునకు గురైనట్లు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్థారించారు. ఇప్పటి వరకు ముంపు బాధితుల తుది జాబితా పూర్తవ్వలేదు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ముంపునకు గురైన కుటుంబాలకు పరిహారం అందజేసే ప్రక్రియ వేగవంతం చేశారు. ప్రతీ కుటుంబానికి ప్రాథమికంగా రూ.10వేలు అందజేసే ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రం వరకు సుమారు 2.85 లక్షల మంది కుటుంబాలకు రూ.284 కోట్లను పంపిణీ చేశారు. గురువారం ఒక్కరోజే సాయంత్రం 4.30 గంటల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఐదు జోన్ల పరిధిలో 51,737కుటుంబాలకు పరిహారం అందజేశారు. ప్రతీ బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. తెలిపారు. ఈ నెలాఖరు వరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలని అధికారులు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement