పూల రైతు విలవిల

ABN , First Publish Date - 2021-05-09T05:05:17+05:30 IST

కర్ఫ్యూ నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపో వడంతో పూల రైతులు విలవిలలాడుతున్నారు. మండలంలో 500 ఎకరా ల్లో జాజిమల్లె, గుండుమల్లె, బంతిపూలు, చేమంతి, కనకాంబరాలు సాగు చేశారు.

పూల రైతు విలవిల
సాగు చేసిన పూలపంట

  1. కర్ఫ్యూ నేపథ్యంలో నిలిచిన ఎగుమతులు


గోనెగండ్ల, మే 8: కర్ఫ్యూ నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపో వడంతో పూల రైతులు విలవిలలాడుతున్నారు. మండలంలో 500 ఎకరా ల్లో జాజిమల్లె, గుండుమల్లె, బంతిపూలు, చేమంతి, కనకాంబరాలు సాగు చేశారు. ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంట చేతికి వస్తుందనుకుంటున్న సమయంలో ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో ఎగుమతుల నిలిచి పోయి పూలు సాగు చేసిన రైతుల పరస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మౌడ్యమి కారణంగా పెళ్లిల్లు, శుభకార్యాలు జరగలేదు. మే నెలలో శుభాకార్యాలు ప్రార ంభమయ్యాయి. మంచి కాలం వచ్చింది అనుకున్న సమయానికి ప్రభుత్వం కరోనా దెబ్బతో కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో పూల ఎగుమతులు నిలిచిపోయాయి. చేతికి వచ్చిన పూల పంట నేలరాలి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూలను గోనెగండ్ల నుంచి విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌, బళ్లారి, రాయచూర్‌, చెన్నైకి ఎగుమతి చేసేవారు. అయితే కర్ఫ్యూ కారణంగా ఎగుమతులు నిలిచి పోవడంతో రైతుల ఆందోళనలో ఉన్నారు. చేతికి వచ్చిన పూల పంట ఒక్కరోజుకన్న ఎక్కువ నిల్వ ఉండదని ఆవేదన చెందుతున్నారు. పూలను స్థానికంగా విక్రయించాలన్నా కిలో రూ.50 నుంచి రూ.60 మాత్రమే ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. కేజీ పూలు కోయడానికి కూలీకి రూ.60 చొప్పున ఇవ్వాల్సి ఉందని, దీంతో నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని పూల రైతులు కోరుతున్నారు. 


పెట్టుబడి కూడా వచ్చేలా లేదు

పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదు. 30 ఎకరాల్లో జాజిమల్లె, గుండుమల్లె, బంతిపూలు సాగు చేశాను. ఎకరానికి పెట్టబడి రూ. 30వేలు అయింది. మే నెలలో పంట చేతికి అందేవిధంగా పంటను సాగు చేశాను. అయితే పంట చేతికి అందేసమయానికి ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగా పూలు అమ్మితే గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం మే ఆదుకోవాలి.                     

-కారుమంచి షేక్‌ హమ్మద్‌, పూల పంటల సాగు రైతు, గోనెగండ.

Updated Date - 2021-05-09T05:05:17+05:30 IST