Abn logo
Oct 24 2021 @ 21:52PM

ఎ‌ఫ్‌సీఐ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

హైదరాబాద్: ప్రపంచ ఆహార దినోత్సవాన్ని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటల పోటీలు, పౌష్టికాహారం (మిల్లెట్ మాల్ట్) పంపిణీ, ఔషధ మొక్కల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సిరిధాన్యాల వినియోగంపై అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ సంప్రదాయ ఆహార భద్రత నుంచి దేశం పోషకాహార భద్రత వైపు పయనిస్తున్న తరుణంలో ఎఫ్‌సిఐ తన విధులను మరింత వేగంతో నిర్వర్తిస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. సమావేశంలో భారత ఆహార సంస్థ సీనియర్ అధికారులు కమలాకర్, సుధాకర్ రావు, రమేష్, అశోక్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

TAGS: FCI

హైదరాబాద్మరిన్ని...