Abn logo
Oct 26 2020 @ 12:30PM

పిల్లలు భోజనం చేయడానికి ముందు.. వీటిని అస్సలు ఇవ్వొద్దు..!

ఆంధ్రజ్యోతి(26-10-2020)

ప్రశ్న: మా పాప వయసు పదకొండేళ్ళు. చలాకీగా ఉంటుంది కానీ బరువు బాగా తక్కువ. బరువు పెరిగేందుకు ఏవైనా సలహాలివ్వగలరు.


- నరసింహాచారి, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: పిల్లల ఎదుగుదల సవ్యంగా ఉండాలంటే సవ్యమైన పోషకాహారం అత్యవసరం. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు, వాటిని పొడి చేసి పిండిలో కలిపి చపాతీ, పరాఠాల లాంటివి చేసి ఇవ్వవచ్చు. పాలల్లో శక్తినిచ్చే పొడులు కలపవచ్చు. ఎటువంటివి కలపాలి అన్న దాని గురించి వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు పెట్టండి. ఆకలి సరిగా లేకపోవడం వల్ల తినడం లేదనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు పెట్టకూడదు. ఇంట్లో తయారు చేసిన నువ్వులు బెల్లం ఉండలు, మినప సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వండి. ఖర్జ్జూరాలు, ఎండు ద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్‌ చేసి మిల్క్‌ షేక్‌లా ఇస్తే బరువు పెరిగేందుకు అవసరమైన కెలోరీలను అందించవచ్చు. ఆ వయసు పిల్లల బరువు నియంత్రణలో ఉండాలంటే ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర చాలా అవసరం. కనీసం ఎని మిది నుండి తొమ్మిది గంటలు నిద్ర పోయేలా చూడాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement