శునక వీరోచితం

ABN , First Publish Date - 2020-11-22T09:51:47+05:30 IST

శునకం విశ్వాసానికి మారు పేరు. ఈ మాట మరోమారు రుజువైంది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం నుంచి నలుగురు రోగులను

శునక వీరోచితం

నిండు గర్భంతో ఉన్నా అగ్ని ప్రమాదంలో చూపించిన సాహసం


సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌(రష్యా), నవంబరు 21: శునకం విశ్వాసానికి మారు పేరు. ఈ మాట మరోమారు రుజువైంది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం నుంచి నలుగురు రోగులను కాపాడిన ఓ శునకం వీరోచితాన్ని రష్యా ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు. నిండు గర్భంతో ఉన్న ఆ శునకం ధైర్య సాహసాలకు ఫిదా అవుతున్నారు. లెనిన్‌గ్రాడ్‌ ప్రాం తంలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడే ఉన్న మాల్టిల్దా అనే శునకం మొరుగుతూ తన యజమానిని అప్రమత్తం చేసింది. వెంటనే మంటలు చెలరేగిన భవంతిలోకి దూకి కార్బన్‌ మోనాక్సైడ్‌ను పడేసి అలారమ్‌ని మోగించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ గదిలో నుంచి నలుగురు రోగులను కాపాడారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన శునకం మాల్టిల్దాను బయటకు తీసుకొచ్చారు. ఆ శునకం ముఖం, మెడ, ఉదరంపై గాయా లు అయినట్లు వైద్యులు తెలిపారు. మాల్టిల్దా గర్భంలోని శునకం పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2020-11-22T09:51:47+05:30 IST