Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రసాదం ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు.. మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు కోర్టు విధించిన శిక్ష ఏంటంటే..

అతడు 64 ఏళ్ల వృద్ధుడు.. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు తన మనవరాలి వయసున్న 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు.. ప్రసాదం ఇస్తానని చెప్పి ఆమెను ఇంటికి పిలిచాడు.. తన ఇంట్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. కేసు విచారించిన స్పెషల్ కోర్టు తాజాగా అతనికి జీవిత ఖైదు విధించింది.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ ఘటన జరిగింది. 


బరేలికి చెందిన దినేష్ మిశ్రా అనే పూజారి తన కాలనీలోనే ఉండే 14 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన ప్రసాదం ఇస్తానని చెప్పి ఆమెను తన ఇంటికి పిలిచాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. స్పెషల్ కోర్టు జడ్జి నవంబర్ 18 నుంచి ఈ కేసు విచారణ ప్రారంభించారు. దినేష్ నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదు విధిస్తూ శనివారం తీర్పునిచ్చారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement