వైద్యం కోసం..ఆస్పత్రి గేటు వద్ద నిరీక్షణ

ABN , First Publish Date - 2020-07-02T11:02:49+05:30 IST

జ్వరంతో వచ్చిన వ్యక్తిని చూసేందుకు డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో బాధితుడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆస్పత్రి గేటు ఎదుట

వైద్యం కోసం..ఆస్పత్రి గేటు వద్ద నిరీక్షణ

జమ్మలమడుగు రూరల్‌, జూలై1: జ్వరంతో వచ్చిన వ్యక్తిని చూసేందుకు డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో బాధితుడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆస్పత్రి గేటు ఎదుట నిరీక్షించాల్సి వచ్చింది. బాధితుడి వివరాల మేరకు... మైలవరం మండలం నవాబుపేటకు చెందిన కల్లూరు మౌలాలికి జ్వరం, దగ్గు ఉండటంతో అంబులెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. తనకు జ్వరం వస్తోందని చెప్పగానే అక్కడ ఉన్న సిబ్బంది కరోనా కారణంగా భయపడ్డారు. వైద్యం చేసేందుకు డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఎవరూ లేరని చెప్పి వెళ్లిపోయారు. రాత్రి 8.30 గంటల వరకు ఆస్పత్రి గేటు వద్దే ఉన్నా ఎవ్వరూ చూడలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై జమ్మలమడుగు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెట్‌ రామేశ్వరుడును వివరణ కోరగా బాధితుడిని విచారించి కడప ఫాతిమా కళాశాలకు వెళ్లాలని చెప్పామన్నారు. అయినా అతడు వెళ్లలేదని తెలిపారు.

Updated Date - 2020-07-02T11:02:49+05:30 IST