ఇదేం పని అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ కుర్రాళ్లు తలపై గుండ్రంగా జుట్టును ఎందుకిలా తీసేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-08T23:28:59+05:30 IST

హర్యానాలో కొందరు యువతీయువకులు చేసిన నిర్వాకం.. అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కొందరు కుర్రాళ్లయితే తలపై జుట్టును గుండ్రంగా తీసేశారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు...

ఇదేం పని అని ఆశ్చర్యపోతున్నారా..? ఈ కుర్రాళ్లు తలపై గుండ్రంగా జుట్టును ఎందుకిలా తీసేశారో తెలిస్తే..

తాము అనుకున్న పని అయ్యేందుకు కొందరు చిత్ర విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేసేస్తుంటారు. కొన్నిసార్లు జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. అరే! వీరికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నాయనా.. అని అనిపిస్తూ ఉంటుంది. హర్యానాలో కొందరు యువతీయువకులు చేసిన నిర్వాకం.. అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కొందరు కుర్రాళ్లయితే తలపై జుట్టును గుండ్రంగా తీసేశారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


హర్యానా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. మహిళలు, పురుషులకు సంబంధించిన కానిస్టేబుల్ పోస్టులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఫిజికల్ టెస్టుకు దాదాపు 2,200మంది అభ్యర్థులు హాజరుకాగా.. చివరికి 200మందిని అర్హులుగా గుర్తించారు. ఈ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా .. ఫిజికల్ టెస్టుల్లో ఎలాగైనా పాసవ్వాలని కొంతమంది యువతీయువకులు చేసిన నిర్వాకం తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఎత్తు తక్కువగా ఉన్న దాదాపు 16మంది అభ్యర్థులు.. టెస్టులో పాసయ్యేందుకు చిత్రవిచిత్రమైన ఐడియాలు వేశారు. కొందరు తలపై జుట్టును గుండ్రంగా తీసేసి, ఆ భాగంలో ఎత్తుగా ఉండే విగ్‌ను అతికించుకున్నారు.

ఆలస్యంగా ఇంటికొచ్చిన భర్త.. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదని.. చివరికి ఏం చేశాడంటే..


ఇంకొందరు అభ్యర్థులైతే అరికాళ్లు వాపు వచ్చేలా చేసుకున్నారు. ఇందుకోసం ముందుగా కాళ్లకు మత్తు ఇంజెక్షన్ వేసుకుని, అనంతరం కర్రతో గట్టిగా కొట్టించుకున్నారు. తద్వారా పాదాలు వాపు వచ్చేలా చేసుకున్నారు. మరికొందరైతే అరికాళ్లకు ఫెవికాల్ రాసుకుని, దానిపై మట్టిని అతికించుకున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు తలపై జుట్టులో క్లిప్పులు ఏర్పాటు చేసుకుంటే.. మరికొందరు వెంట్రకలకు మైనం పూసుకున్నారు. అయితే కొలతల సమయంలో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా విషయం బయటపడింది. దీంతో వారందరినీ అనర్హులుగా ప్రకటించి, వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇదిలా వుండగా, తమకు అన్ని అర్హతలు ఉన్నా రిజెక్ట్ చేశారంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఫోన్‌లో మాట్లాడుతూ స్కూటీపై రైలుకే ఎదురెళ్లింది.. చివరికి ఈ యువతి చేసిన పనికి అంతా షాక్..

Updated Date - 2022-02-08T23:28:59+05:30 IST